ఐడియా

నిద్రలేమిని తగ్గించే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రలేమి అనేక జబ్బులకు దారి తీస్తుంది. నిద్ర సక్రమంగా వస్తే రోజంతా హాయిగా పనులు చక్కబెట్టుకోవచ్చు. లేకుంటే తల బరువుగా ఉండటం, ఆవలింతలు రావడం, ఏ పనీ చేయబుద్ధి కాకపోవడం, నీరసంగా ఉండటం వంటివి తలెత్తుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఒత్తిడిలు ఉండకూడదు. సమయానుసారం నిద్రకు ఉపక్రమించాలి. దీంతో నిద్ర సరిగా పడుతుందంటారు వైద్యులు. ఒకవేళ నిద్ర రాకుండా ఇబ్బంది పడుతుంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించవచ్చు.
* అశ్వగంధ, బ్రహ్మీ, శంఖపుష్పం, శతావరి, ముల్హటీ, ఉసిరికాయ, జటామాసిలను.. ప్రతిదీ 50 గ్రాముల చొప్పున చూర్ణం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మూడు ఉంచి ఐదు గ్రాములను పాలతో కలిపి తాగాలి. ఒక వారం తర్వాత దీని ప్రభావం చూపిస్తుంది. దీంతో నిద్రలేమి దూరమై గాఢనిద్ర పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
* ఈ చూర్ణం అల్లోపతి నిద్రమాత్రల్లా మైమరిచి నిద్రపోయేలా ఉండదు.
* ఉదయం నిద్ర నుంచి లేచిన తరువాత ఎంతో ఉల్లాసంగా కూడా ఉంటారు.
* ఈ చూర్ణం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
* అశ్వగంధ, భంగు ఆకులను సమపాళ్లలో తీసుకుని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని మూడు గ్రాములు లేదా ఐదు గ్రాములను నీటిలో కలిపి తాగాలి. ఇది ఎలాంటి ఆపదను కలిగించదు.
* రక్తహీనతతో బాధపడుతున్న వారిలో నిద్రలేమి ప్రభావం ఉందని బాధపడేవారు ఈ చూర్ణాన్ని తీసుకుంటే వారి సమస్యలు తగ్గిపోతాయి.