ఐడియా

చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్లయిసర్‌తో కోస్తే ముక్కలు బాగా వస్తాయి.
* పుదీనా పచ్చడిలో కాస్త పెరుగు కలిపితే రుచి, రంగు బాగుంటాయి.
* కిచెన్‌లో బొద్దింకల బాధ తొలగిపోవాలంటే గది మూలల్లో కాస్త బోరిక్ పౌడర్‌ను చల్లాలి.
* బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజితో తుడిస్తే మైక్రోఓవెన్‌లో దుర్వాసన తొలగిపోతుంది.
* కూరగాయలను కోసిన తర్వాత నీళ్లలో కడగవద్దు. ముక్కలు చేసిన కూరగాయలను ఎక్కువ సమయం నీటిలో ఉంచకూడదు.
* వంటలు వండగా మిగిలిపోయిన నూనెను పదే పదే వేడిచేసి వాడడం మంచిది కాదు.
* బియ్యం, పప్పులను మరీ ఎక్కువసార్లు నీళ్లలో కడగవద్దు.
* కూరగాయలు, పప్పులు వండినపుడు తినేసోడాను కలపవద్దు.
* గ్యాస్ స్టౌపై వండే సమయంలో పాత్రలపై విధిగా మూ తలు పెట్టడం మరచిపోరాదు. ఇలా చేస్తే వంట గ్యాస్ వృథా కాదు.
* ఎక్కువ నూనెతో కూరలు వండడం కన్నా, ఆవిరిలో ఉడికించి వండుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం.