ఐడియా

డైటింగ్ భ్రమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తున్నామంటుంటారు చాలామంది. డైటింగ్ చేసినా బరువు తగ్గడం లేదంటారు మరికొందరు. ఇప్పుడు డైటింగ్‌తో బరువు తగ్గరు అంటున్నది పరిశోధన. కేవలం ఆహారం తీసుకోవడం మానేస్తే బరువు తగ్గుతారన్నది భ్రమ మాత్రమే.. వ్యాయామం, క్రమం తప్పని ఆహారపు అలవాటు వలనే బరువు తగ్గుతారు కానీ పూర్తిగా ఆహారం మానేసినంత మాత్రాన ఏం లాభం ఉండదు. డైటింగ్‌తో సన్నబడినట్లు కనిపించవచ్చు. కానీ అది బరువును నియంత్రించదు. డైటింగ్ అంటూ తిండి మానేసేవారు దీర్ఘకాలంలో లావెక్కుతారుగానీ సన్నబడరు. డైటింగ్ ఆపేసి క్రమపద్ధతిలో ఆహారం తీసుకోవాలి. ఆహారం కూడా నెమ్మదిగా తినాలి. హడావుడిగా తినడం వల్లనే పొట్ట పెరుగుతుంది. ఆహారం, వ్యాయామం నియమబద్ధంగా ఉంటే బరువు సమస్య కానేకాదు.