ఐడియా

అనాదిగా అందం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడే సౌందర్య లేపనాలు, సంప్రదాయ పద్ధతులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవేనని చరిత్ర చెబుతోంది. ఈతరం వారు వాడుతున్న సౌందర్య లేపనాలు అంటే కాస్మొటిక్స్ మన పూర్వీకులు వాడినవే అని అందరికీ తెలియని విషయం. కానీ ఇప్పటికీ ఆ సౌందర్య చిట్కాలను నిపుణులు కొనసాగిస్తున్నారు. అవేంటో చూద్దామా..
* సౌందర్య లేపనాల్లో ఉపయోగించే తియ్యని పదార్థం తేనె. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గాయాలు మానేందుకు యాంటీసెప్టిక్‌గా కూడా తేనెను ఉపయోగించడం పురాతన కాలం నుంచీ వస్తుంది. ఈజిప్షియన్లు వైద్యంలో దీన్ని విరివిగా వాడేవారు. చర్మ సౌందర్యానికి కూడా దీన్ని వినియోగించేవారు. చర్మంపై వచ్చే మొటిమలను తగ్గించేందుకు తేనెతో చేసిన లేహ్యాన్ని మొహానికి ప్యాక్‌లా వేసుకునేవారు. చర్మాన్ని, జుట్టును మృదువుగా చేసేందుకు తేనెను వాడేవారు.
* సౌందర్య లేపనంగా, ఔషధంగా పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న మరో సాధనం సముద్రపు ఉప్పు. గాయాలు మానేందుకు యాంటీసెప్టిక్‌గా, పదార్థాలను నిలువ ఉంచేందుకు దీన్ని మన పూర్వీకులు విరివిగా ఉపయోగించేవారు. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించుకునేందుకు, చర్మం మెరిసేలా చేసేందుకు సముద్రపు ఉప్పుతో ఫేస్‌మాస్క్ వేసుకునేవారు. గ్రీకులు సముద్రపు నీరు, ఉప్పుతో ముఖాన్ని, మెడ ప్రాంతాన్ని మసాజ్ చేయించుకునేవారు. అప్పట్లో వాడుకలో ఉన్న ఒక రకమైన హైడ్రోథెరపీకి సముద్రపు నీరు నింపిన చిన్న కొలనులను ఉపయోగించేవారు.
* వేల సంవత్సరాల నుంచి ఆహారంలో గుడ్డు భాగంగా ఉంటోంది. అందాన్ని మెరుగు పరచుకోవడానికి దీన్ని పురాతనకాలం నుండి ఉపయోగిస్తున్నారు. తలకు గుడ్డు సొన పెట్టుకుని స్నానం చేయడం అనేది ఎప్పటినుంచో వస్తోంది. పచ్చసొనకు తేనెను కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. గుడ్డును సౌందర్య ఉత్పత్తుల్లో వాడటం వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతి.
* దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆలివ్‌నూనెను సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతున్నట్లు ఆధారాలున్నాయి. పురాతన గ్రీకులు, రోమన్‌లు, ఈజిప్షియన్లు తమ అందాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని వాడేవారు. దీంట్లో విటమిన్ - ఇ అధిక మోతాదులో ఉంటుంది. దీన్ని చర్మానికి, గోళ్లకు, జుట్టుకు పట్టించి, దీనిలో ఉన్న ఔషధ గుణాలను పొందేవారు. ఇది చర్మానికి సాగే గుణం వచ్చేలా చేస్తుంది. చర్మానికి ఉండే సహజ నూనెలను బయటకు పోనివ్వకుండా కాపాడుతుంది. జుట్టు, గోళ్లు పొడిబారకుండా మెరిసేలా చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి అప్పటినుంచి ఇప్పటివరకూ దీని వాడకం కొనసాగుతోంది.
* చర్మవ్యాధుల్ని నివారించేందుకు, బాక్టీరియా, ఫంగల్ వంటి వాటికి నివారిణిగా కొబ్బరినూనెను వాడతారు. సౌందర్య సాధనాల్లో దీని వాడకం ఈ మధ్య బాగా పెరిగింది.. అయితే దీని వాడకం వందల సంవత్సరాల నుంచి వస్తోంది. తలకు కొబ్బరినూనెతో మాస్క్ వేయడం మనం బ్యూటీ పార్లర్‌లో చూస్తున్నాం. చర్మానికి విటమిన్-డి అందేందుకు కొబ్బరినూనె ఉపయోగపడుతుంది.
* క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచే వాక్సింగ్ అందుబాటులో ఉందనేది నమ్మలేని నిజం. అప్పట్లో దీన్ని పర్షియన్ వాక్సింగ్ అనేవారు. చెరకు నుంచి తీసిన మొలాసిస్, నిమ్మరసం, తేనెలను ఉపయోగించి మైనంలాంటి పదార్థాన్ని తయారుచేసేవారు. దీనిని ఉపయోగించి చర్మంపై ఉన్న వెంట్రుకలను తొలగించేవారు. ఇప్పడు బ్యూటీపార్లర్లలో వాడే వాక్సింగ్ పద్ధతి పురాతన కాలం నుంచి వారసత్వంగా వచ్చిందే..
* ఈజిప్షియన్ రాణి క్లియోపాత్ర కుంకుమపువ్వు నూనె, పాలను కలిపి స్నానం చేసేదట. ఆమె అందానికి రహస్యం ఇదేనని అప్పట్లో దేశప్రజలు చెప్పుకునేవారు. ఈ సౌందర్య లేపనం వేల సంవత్సరాల నుంచి వినియోగంలో ఉంది. మనదేశంలోని పురాతన ఆయుర్వేద పద్ధతుల్లో దీని ప్రస్థావన ఉంది. ఈ సౌందర్య లేపనం ధరలు చాలా ఎక్కువ. ఫలితంగా దీని వాడకం ఈ కాలంలో బాగా తగ్గింది.
* ఇప్పట్లో విరివిగా వాడుకలో ఉన్న అనే ఫేస్‌మాస్క్‌లు బంకమట్టితో తయారుచేసేవే.. దీన్ని నేరుగా మొహానికి మాస్కులా వేయవచ్చు.