ఐడియా

వర్షాకాలంలో కేశ సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వర్షాకాలంలో జుట్టు పాడవకుండా ఉండాలంటే.. తల మాడు చల్లగా, దురదగా ఉంటే వేప నూనె రాసుకోవాలి. నూనెలో నిమ్మకాయ లేదా కరివేపాకులు కలిపి రాసుకుంటే కురులు బాగా పెరుగుతాయని బ్యూటీషియన్లు అంటున్నారు. ఇక చుండ్రు అధికంగా ఉంటే తలకు పెరుగు లేదా రిఫైన్డ్ ఆయిల్‌గానీ రాసుకుని తల స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. తడిగా వున్నప్పుడు తలను దువ్వకూడదు. ఒకవేళ దువ్వితే కురులు బలహీనపడే అవకాశాలు ఎక్కువ. అలాగే హెయిర్ కలరింగ్, స్ట్రెయిట్నింగ్ లాంటివి ఈ కాలంలో చేయించుకోకపోడమే ఉత్తమం. తలకు వీలైనంతవరకు హెర్బల్ షాంపునుగాని, యాంటీ డాండ్రాఫ్ షాంపూను వాడాలి. వారానికి 2, 3సార్లు తల స్నానం చేయాలి. తలను హెయిర్ డ్రయ్యర్‌తో పొడి చేయకూడదు. వీలైనంతవరకు మెత్తని టవల్‌తో తుడుచుకోవడం మంచిది.