ఐడియా

అపర సంజీవిని... అల్ల నేరేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఆరోగ్యానికి అమృతం వంటిది. పండును బాగా కడిగి, శుభ్రంచేసి రోజుకో మూడు, నాలుగు తినాలి. ఈ పండ్లతో ముఖ్యంగా మధుమేహం అదుపులోకి వస్తుంది.
వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతాఫలంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈ పండును అపర సంజీవనిగా పిలుస్తారు. ఈ పండులో విటమన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.
నేరేడు పండు మాత్రమేకాక ఆకులు, గింజలు, చెట్టు బెరడుకూడా ఔషధాల తయారీలో వాడుతారు. ఈ అల్లనేరేడు చెట్లు కాయల నుండి వెనిగర్‌ను తయారుచేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగుపరుచుకోవాలంటే నేరేడుపండ్లు తినమని పరిశోధకులు సూచిస్తున్నారు.
* నేరేడుపండ్లు మధుమేహ బాధితులకు దివ్యౌషధం. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీళ్లలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
* నోటి పూత, చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
* జిగట విరేచనాలతో బాధపడే వారికి 2-3 చెంచాల నేరేడు పండ్ల రసాన్ని ఇస్తే విరేచనాలు తగ్గుతాయి.
* పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
* జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
* మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
* కడుపులో ఉండే మలినాలను, పొరబాటున మింగిన వెంట్రుకలను నేరేడు పండ్లు కరిగించి బయటకు పంపిస్తాయి. జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడతాయి.