ఐడియా

ఇల్లు శుభ్రంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో ఇల్లంతా తడితడిగా మారిపోతుంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా చినుకుల కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* వీలైనంతవరకూ ఇంటిని పొడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఎండ బాగా ఉన్నప్పుడు కిటికీలు తెరవాలి. ఇల్లంతా ఎండ పడేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఫర్నిచర్‌ని కూడా పొడి వస్త్రంతో రెండురోజులకొకసారి తుడుస్తూ ఉండాలి. నేలను కూడా ఎప్పటికప్పుడు యాంటీ బాక్టీరియల్ గుణాలున్న ద్రావణంతో ప్రతిరోజూ శుభ్రం చేయాలి.
* వర్షాకాలంలో అల్మారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే వార్డ్‌రోబ్‌లో సిలికా జెల్ శాచెట్లు పెట్టుకోవాలి. అవి తేమను పీల్చుకుంటాయి. ఈ కాలంలో దుస్తులు ఒక పట్టాన ఆరవు. అలాంటప్పుడు కాస్త తడిగా ఉన్నప్పుడు మడతపెట్టి వార్డ్‌రోబ్‌లో పెట్టేయడం సరికాదు. దీనివల్ల కూడా ఫంగస్ చేరొచ్చు. అందుకే దుస్తులు పూర్తిగా ఆరాయనుకున్నాకే సర్దుకోవాలి. కుదిరితే చిన్న బల్బుని అల్మారాలో పెట్టే ప్రయత్నం చేయాలి. దాన్నుంచి వచ్చే వేడి, తేమను పీల్చుకుంటుంది. ఈ బల్బు చిట్కా చెప్పుల అరకు కూడా వర్తిస్తుంది. ఉతికిన దుస్తులు అయినా సరే ఎండ బాగా ఉన్నప్పుడు ఓసారి ఆరేసి తీయడం మంచిది. అలాగే కర్పూరం బిళ్లలూ, వేపాకులు, లవంగాలు దుస్తుల అల్మారాలో ఉంచితే క్రిములు చేరవు.
* వర్షాకాలంలో బంగారం, వజ్రాల నగలకు ఎలాంటి హాని జరగదు. కా వెండి నగల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి రంగు మారతాయి. అందుకే వాటిని టిష్యూ లేదా నూలు వస్త్రంలో చుట్టి జిప్‌లాక్ బ్యాగుల్లో భద్రపరచుకోవాలి. వాటిని గాలి, వెలుతురు తగలని చోట ఉంచితే సరిపోతుంది. మిగిలిన నగల్ని కూడా అలాగే పెట్టుకోవాలి.
* లెదర్‌కి కూడా ఫంగస్ సమస్య ఉంటుంది. అందుకే లెదర్‌తో చేసిన బ్యాగులు, చెప్పులూ తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ తడిస్తే వెంటనే గది ఉష్ణోగ్రతలో ఆరనివ్వాలి. తరువాత దానికి చిటికెడు నూనె రాసుకుని తుడిస్తే ఫంగస్ దరిచేరదు.
* వర్షాకాలంలో తరుచూ దుస్తులపై బురద లేదా కొన్ని రకాల మట్టి మరకలు పడుతూ ఉంటాయి. వాటిని ఎలా తొలగించుకోవాలంటే.. పచ్చి బంగాళాదుంపను సగానికి కోసం ఆ ముక్కతో మరకపై రుద్దాలి. తరువాత చల్లని నీళ్లలో అరగంటపాటు ఉంచి ఉతికితే మరకలు తొలగిపోతాయి.
* ఒక కప్పు వెనిగర్ వేసిన నీటిలో మరకలు పడిన దుస్తుల్ని నానబెట్టి ఉతికితే మరకలు తొలగిపోతాయి. షేవింగ్ క్రీం కూడా ఇందుకు చక్కగా ఉపయోగపడుతుంది.
* మరక తడిగా ఉండగానే దానిపై మొక్కజొన్న పిండి చల్లి.. కాసేపయ్యాక బ్రష్‌తో దులిపేసి, ఉతికేస్తే.. మరకలు తొలగిపోతాయి.