ఐడియా

చక్కని సంసారం చల్లని సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సంసారమే బృందావనం ఆనంద తీరాల నవ నందనం.’ అన్న మాటేమోగానీ చక్కని సంసారం ఉన్న ఇల్లు అనునిత్యం సౌభాగ్యంతో కళకళలాడుతూ వుంటుంది. సంసారం సాఫీగా సాగిపోవాలంటే ఇల్లాలు ఎంతో ఓర్పుతో, నేర్పుతో కుటుంబంతో సహకరించాలి. కొన్ని ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలుంటాయి. మరికొన్ని ఇళ్లలో ఇద్దరే ఇద్దరుంటారు. భార్యాభర్తల బంధం అపురూపమైనటువంటి బంధం. అనుబంధంతో కూడిన సంసారం కుటుంబంలో అంద రూ ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే ఆ సంసారం నందన వనం కాగలదు.
అంతేగాని కొన్ని సంసారాలలో మనస్పర్థలు, కీచులాటలు, గొడవలు చీటికిమాటికి పోట్లాటలు ఇలాంటివి బజారుకెక్కే ప్రమాదముంది తప్ప రాణించలేవు. ఆనందమైన సంసారం అనుబంధానికి మరో పేరుగా నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. భర్త మాట భార్య, భార్య మాట భర్త వినగలగాలి. సంసారంలో నేనేరాజు నేనే మంత్రి అన్న కాలం పోయింది. ఇరువురి అభిప్రాయాలు ఒకటి కావాలి. అప్పుడు సంసారం సౌభాగ్యంగా విలసిల్లగలదు.
భార్యాభర్తలు తమ సంసారం సాఫీగా నడపడంలో చక్కని సారథ్యం వహించాలి. తమ జీవితంలో ఎలాంటి చికాకులు రాకుండా చూసుకోవాలి. పిల్లలున్న ఇల్లు సందడిగా వుంటాయి. మరికొన్ని గందరగోళంలా వుంటాయి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, సంసారం, ఒక కుటుంబానికి వారధి కాగలవు. దానిని చక్కగా చూసుకోవాలి.
కొన్ని టీవీ సీరియల్స్‌లో చూసిన రీతిలో, భార్యాభర్తలు ఏదో ఒక చిన్న విషయానికి గొడవలు పడడం, చీటికి మాటికి చికాకుగా వుండడం అనుమానాలు తావివ్వడం వంటివి చక్కని సంసారానికి అవరోధం కలిగిస్తాయి.
ఈ విషయాన్ని భార్యాభర్తలిరువురూ గ్రహించాలి. చిన్నచిన్నగొడవలను వెంటనే ప్రక్కన తీసిపెట్టాలి. భవిష్యత్ కార్యాచరణ గురించి నిత్యం ఆలోచించాలి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు చక్కగా తీర్చిదిద్దబడితే ఆ సంసారం శుభోదయం కాగలదు. చక్కని సంసారానికి చల్లని మనసుండాలి. చిరునవ్వుల హృదయం వుండాలి.
చిన్నచిన్న గొడవలకు అప్పటికప్పుడే పరిష్కారం ఆలోచించి చక్కదిద్దాలి. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు సైతం నందనవనంలా వికసిస్తాయి. ఉద్యోగం చేసే కాపురాలలో సైతం అవగాహన కలిగి వుండాలి. అప్పుడు తగాదాలకు తెర దించవచ్చును. శెలవురోజులలో భార్యాభర్తలు ఆనందంగా గడపాలి. ఎంతో కష్టపడి అలిసిసొలిసి వచ్చిన భర్తకు ఇంటి ఇల్లాలు ప్రేమ పూర్వకంగా సేద తీర్చగలగాలి. అప్పుడు భర్త తన కష్టం ఇట్టే మరచిపోతాడు. ఇల్లాలు చిరునవ్వుతో పలకరింపు భర్త అనురాగానికి, ప్రేమకు శ్రీకారం చుడుతుంది. ఒకరినొకరు పరస్పరంగా అర్థంచేసుకునే మనస్తత్వం సంసార సౌభాగ్యానికి సిరులు పండించగలదు.
చివరగా ఓక చిన్నమాట ఇంట్లో వృద్ధులు, పెద్దలు వుంటారు. అలాంటి వారిని చీదరించుకోకుండా గౌరవించడం నేర్చుకోవాలి. వారుకూడా ఒకప్పుడు మనలాంటి వారేనని గ్రహించాలి. పెద్దల్ని గౌరవించడం మన సంస్కారంనకు నిదర్శనం కాగలదు.

- ఎల్.ప్రపుల్లచంద్ర