ఐడియా

ముల్లంగితో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజువారీ జీవనంలో కొన్ని కూరగాయల్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అందులో ముల్లంగి కూడా ఒకటి. దానిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవేంటో చూద్దాం..
* ముల్లంగి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
* కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుంది.
* ముల్లంగిలో కేలరీలు చాలా తక్కువ. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు ఉండే దీనిలో పిండి పదార్థాలు సున్నా. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహారం అంటారు పోషకాహార నిపుణులు.
* కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు నివారించడంలో ఈ దుంప కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఫంగల్ గుణాలే అందుకు కారణం.
* ఇందులో విటమిన్ సి, జింక్, ఫాస్పరస్ వంటివి చర్మం పొడిబారకుండా చేస్తాయి. మొటిమల్ని నివారించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
* ఫ్లేవనాయిడ్లు ముల్లంగిలో అధికం. ఇవి గుండెకు రక్తసరఫరా సరిగ్గా జరిగేలా చేస్తాయి. గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి. దీన్ని పదార్థాలుగానే కాదు, సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.