ఐడియా

ఈ మార్పులు అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవనశైలిలో, ఆహారపరంగా మార్పులు రావడానికి మనం ఇష్టపడం. అలాకాకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. మెనోపాజ్ దశ దాటాక ఎదురయ్యే చాలా రకాల సమస్యల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..
* ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఇనుము కూడా తప్పనిసరే.. ఈ శాతం తగ్గితే హృద్రోగాలు వచ్చే అవకాశం అధికం. ఆకుకూరలు, చేపలు, మాంసాహారం పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు వంటి వాటిలో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము శాతం ఎక్కువై రక్త ప్రవాహంలో ఎటువంటి సమస్యలూ లేకుండా గుండె పదిలంగా ఉంటుంది.
* ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలి. లేదంటే అధిక రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఇది కూడా గుండె అనారోగ్యానికి, ఇతర సమస్యలకు కారణమవుతుంది.
* ప్రతిరోజూ పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటమే కాకుండా, శరీరంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తాయి. త్వరగా ఆకలి కూడా వేయదు.
* వయసు కాస్త మీద పడేటప్పటికి ఎముకలు బలహీనపడటం మామూలే.. అలా జరగకుండా ఉండాలంటే ఆహారం ద్వారా కాల్షియం అందేలా చూసుకోవాలి. ఆకుకూరలు, బెండకాయ, చిక్కుడు, బీన్స్, చిలగడదుంప వంటి కూరగాయలతో పాటు నారింజ, జామ, బొప్పాయి వంటి పండ్లను కూడా తీసుకుంటే విటమిన్ డి అందుతుంది. అలాగే చేప, చీజ్, గుడ్డు, నారింజపండు వంటి వాటి నుండి కూడా ఈ పోషకం అందుతుంది.
* వీలైనంతవరకు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ప్రతిరోజూ నడిచేలా చేయడం, జీవనశైలిలో ప్రాథమికంగా చేసుకోవాల్సిన మార్పు. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా మెట్లు ఎక్కి దిగాలి. కాళ్లలోని కండరాలు దృఢంగా మారి శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
* ఎక్కువసేపు ఒకేచోట కూడా కూర్చుని ఉండకూడదు. అరగంటకోసారైనా అటూ ఇటూ కదులుతూ ఉండాలి.
* వీలైతే వ్యాయామాన్ని కూడా దినచర్యలో భాగంగా చేసుకోవాలి. యోగా, జిమ్ ఏదైనా కావచ్చు. దానివల్ల బరువు అదుపులో ఉండటమే కాదు, మానసిక ప్రశాంతత కూడా సొంతమవుతుంది.
* ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి దరిచేరదు. నేటి ఉద్యోగాల వల్ల ఒత్తిడి కలగడం సహజం. దినచర్యలో ధ్యానాన్ని జత చేసుకుంటే అనారోగ్యం దరిచేరదు. ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. కనీసం పదినిముషాలు ధ్యానం చేసినా మంచిదే.