ఐడియా

నడుం నొప్పిని తగ్గించే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడుం నొప్పి అనేది అన్ని వయస్సుల వారు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య. కష్టమైన దైనందిక కార్యకలాపాలు, పని ఒత్తిడులు వెన్నునొప్పికి గల ప్రధానమైన కారణాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, కండరాల ఉద్రిక్తత, వ్యాయామం చేయకపోడం, శరీర భంగిమలు సరిగ్గా లేకపోవడం, అధిక శరీర బరువు, శ్రమతో కూడిన పనులు వంటి అనేక కారణాల వల్ల కూడా ఈ వెన్నునొప్పి రావొచ్చు. వీపు కింది భాగంలో అంటే పిరుదుల భాగంలో దీర్ఘకాలిక నొప్పి, మంచంపై పడుకోవడం కష్టంగా ఉండటం, ఎక్కువకాలం నిలబడలేకపోవడం, ఒకచోట స్థిరంగా కొద్దిసేపు కూడా కూర్చోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యను పట్టించుకోని పక్షంలో ఇది భవిష్యత్తులో ఇతర అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలకు కారణం కావచ్చు. అందుకే వెన్నునొప్పికి తక్షణం వైద్య సహాయం తప్పనిసరి. దీనితో పాటు తక్షణ ఉపశమనం కోసం వెన్నునొప్పికి అనేకరకాల సహజ నివారణా పద్ధతులు కూడా మనుగడలో ఉన్నాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి వంటింటి సుగంధద్రవ్యంగా మనందరికీ సుపరిచితమే.. దీనిలోని శోధ నిరోధక లక్షణాలు వెన్నునొప్పి చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతుంది. ఇది అల్లిసిస్ అనే సహజ సమ్మేళనాన్ని కూడా కలిగి ఉంటుంది. క్రమంగా ఇది ఒక పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయానే్న రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం మూలంగా వెన్నునొప్పి తగ్గుతుంది.
అల్లం
వంటింటిలో కనిపించే మరో సుగంధద్రవ్యం అల్లం. ఇది కూడా వెన్నునొప్పి ఉపశమనానికి సహాయపడే శోధ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అసౌకర్యం, నొప్పిని తగ్గించడానికి వంటల్లో తరచూ అల్లాన్ని ఉపయోగించాలి. లేదా ప్రతిరోజూ అల్లం టీని తాగవచ్చు.
కొబ్బరినూనె
ముడి కొబ్బరినూనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, అనాల్జేసిక్, యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. కొబ్బరినూనె అన్ని రకాల వెన్నునొప్పులకు చికిత్స చేయగలదు. కాబట్టి తక్షణ ఉపశమనం కోసం కొబ్బరినూనెను పూయాలి. పదినిముషాలపాటు మసాజ్ చేయాలి. తక్షణ ఉపశమనం లభిస్తుంది.
చామంతి టీ
శతాబ్దాలుగా చామంతి టీని నొప్పుల చికిత్సలో ఉపయోగించడం జరుగుతోంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు సహజంగానే వెన్నునొప్పిని తగ్గిస్తాయి.
పసుపు కలిపిన పాలు
పసుపు సహజసిద్ధమైన యాంటీ బయాటిక్. అందుకే ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో రెండు, మూడు చిటికెల పసుపు వేసుకుని తాగడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
క్యాప్సైసిస్
క్రీమ్ మిర్చిలో క్యాప్సైసిస్ అనే క్రియాత్మక పదార్థం ఉంటుంది. ఇది నొప్పిని కలిగించే ఒక రకమైన న్యూరోకెమికల్‌ను తగ్గించడానికి ఉత్తమమైనది. దీనిలో అత్యుత్తమంగా అనాల్జెసిక్ ప్రభావాలు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక నొప్పుల చికిత్సలో క్యాప్సైసిస్ ప్రభావశీలతను కొన్ని అధ్యయనాలు కూడా నిరూపించాయి.