ఐడియా

బొద్దింకలను నివారిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఇంట్లోనూ.. ముఖ్యంగా వంటింట్లో బొద్దింకలు పెడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ప్రతి మహిళకు ఇది చాలా పెద్ద సమస్య. ఇల్లు, వంటిల్లు ఎంత శుభ్రంగా ఉన్నా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. వాటిని నివారించడం పెద్ద సమస్య. అలాంటి బొద్దింకలను చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
* బొరాక్స్ పౌడర్‌ను మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగం పంచదారను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉన్నచోట చల్లితే బొద్దింకలను కొన్ని గంటల్లోనే నివారించవచ్చు. పంచదార కలిపిన ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తినడం ద్వారా అవి నాశనమవుతాయి.
* ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉండి బోరాక్స్ పౌడర్‌ను వాడటం సురక్షితం కాదు అనుకుంటే బొరాక్స్ పౌడర్ బదులు బేకింగ్ సోడా, పంచదారలను ఉపయోగించవచ్చు.
* సాధారణంగా ఉల్లిపాయలో ఘాటైన వాసన ఉంటుంది. ఉల్లిపాయలను తీసుకుని వాటి నుండి రసం తీసి బల్లులు తిరుగుతున్న గోడలపై, బొద్దింకలు తిరుగుతున్న ప్రదేశాల్లో చల్లడం లేదా స్ప్రే చేయడం వల్ల వీటిని నివారించడంతో పాటు మరే ఇతర క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.
* కాఫీ గింజలను అలమరలలో, వంటగదుల్లో అక్కడక్కడా పెట్టడం ద్వారా బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
* వాడేసిన నిమ్మ తొక్కలను అలమరల్లో ఉంచడం ద్వారా బొద్దింకలు, చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు.