ఐడియా

ప్లాస్టిక్ డబ్బాలలో ఏ పదార్థం నిల్వచేసినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ప్లాస్టిక్ డబ్బాలలో ఏ పదార్థం నిల్వచేసినా వాసన పట్టేసి ఒక పట్టాన వదలదు. డబ్బాలను వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లలో నానబెట్టి కడిగితే వాసనపోయి క్లీన్‌గా ఉంటాయి.
* వెండి గినె్నలు, పళ్లాలు మకిలిగా ఉంటే విభూతి పొడితో తోమితే తెల్లగా, కాంతివంతంగా ఉంటాయి.
* చెక్కర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట వుంచి ఆపైన సబ్బునీటితో కడిగి తెల్లటి మెత్తని గుడ్డతో తుడిస్తే కొత్తవాటి వలే ఉంటాయి.
* దుమ్ము కంట్లో పడితే కాసిన్ని పాల చుక్కలు కంట్లో పోసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
* గోరువెచ్చని నీటిలో నీలిమందు కలిపి ఆ నీటితో అద్దాలు తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* పాలరాతి నేలలు, బల్లలు శుభ్రం చేసేటపుడు వీలయినంత వరకు నీరు వాడకూడదు. టర్పెంటెయిన్ చల్లి పొడి బట్టతో తుడవాలి.

-బి. విజయలక్ష్మి