ఐడియా

మోచేతుల చర్మం మెరవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగిలిన భాగాలతో పోలిస్తే మోకాళ్లు, మోచేతుల వద్ద చర్మం మందంగా, నల్లగా ఉంటుంది. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మోకాళ్ళ, మోచేతుల వద్ద నల్లగా మారిన చర్మం సైతం పలుచబడి, నునుపుగా తయారవుతుంది.
* చెంచాడు కొబ్బరి నూనె, అరచెంచా నిమ్మరసం కలిపి మోకాళ్లు, మోచేతుల వద్ద రుద్ది, వేడినీళ్లలో ముంచిన టవల్‌తో తుడవాలి. ఇలా వారానికోసారి చేస్తే సమస్య తొలగిపోతుంది.
* మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా, మందంగా మారితే రోజూ నిమ్మ చెక్కతో ఆ భాగాల దగ్గర రుద్ది పావుగంట సేపు ఆగి వేడినీళ్లతో ముంచిన టవల్‌తో శుభ్రంగా తుడవాలి. ఇలా నెలరోజులపాటు చేయాలి. తర్వాత వారానికి రెండుసార్లు చేస్తూంటే మామూలు చర్మంలా మారిపోతుంది.
* వాల్‌నట్ పొడి, కొబ్బరినూనె కలిపి తరచూ రాస్తుంటే నల్లబడి, గరుకుగా ఉన్న చర్మం సున్నితంగా మారుతుంది.
* రెండు చెంచాల పెరుగుకి కొంచెం బాదం పొడి కలిపి రాసుకున్నా చర్మపు నలుపు తగ్గిపోతుంది.
* గుడ్డులోని తెల్లసొనకు చెంచాడు పంచదార, అరచెంచా జొన్నపిండి కలిపి దానిని గరుకుగా ఉన్న చోట రాసుకుని ఆరాక శుభ్రపరుచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.