ఐడియా

క్యారెట్‌లో పోషకాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ప్రతిరోజూ తినే తాజా కూరగాయల్లో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్ వంటివి తింటే ఎటువంటి రోగాలూ దరిచేరవు. ఇందులో ఉండే విటమిన్ ‘ ఎ’ కంటికి మేలు చేస్తుంది. క్యారెట్‌ను పరగడుపునే పచ్చిగా తింటే ఇంకా మంచిది. ఇందులో కెరోటిన్ అనే పోషక పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటిచూపు మందగిస్తుంది. అదే విటమిన్ సమృద్ధిగా ఉండే క్యారెట్ కంటికి, వంటికి చాలా మంచిది. చిన్నప్పటి నుంచే పిల్లలకు క్యారెట్ తినిపించడం అలవాటు చేయాలి. ప్రపంచంలోనే అత్యధిక పోషక విలువలున్న ఆహార పదార్థాలతో పాటు క్యారెట్ కూడా అగ్రస్థానం అలంకరించింది. క్యారెట్‌ను తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు దీన్ని రోజూ తినడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. తాజా క్యారెట్లను తినడం వల్ల ఆరోగ్యంతో పాటు విటమిన్లు, పోషకాలు మెండుగా లభిస్తాయి. క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కేన్సర్ దరిచేరదట. దీనిలో ఉండే ఫాల్ కారినాల్ అనే మూలకం కేన్సర్‌ను నిరోధిస్తుంది. క్యారెట్‌ను ఉడకబెట్టి తినడం కూడా మంచిదే. దీనిలో యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి. నీరసంగా ఉన్నవారికి పాలుతో కలిపిన క్యారెట్ జ్యూస్‌ను ఇవ్వాలి. రే చీకటి వ్యాధిని సైతం దూరం చేసే గుణం క్యారెట్‌లో ఉంది. పచ్చి క్యారెట్‌ను పరగడుపునే నమలడం వల్ల దంతాలు మెరుస్తాయి. దంత రోగాలు దరిచేరవు.

- ఎల్. ప్రఫుల్లచంద్ర