ఐడియా

వేరుశెనగతో వేయ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచితోపాటు, అంతకుమించి విలువైన పోషకాలువుండే వేరుశెనగ కాయలతో గుండె జబ్బులు దూరమవుతాయి. అందుకే వేరుశెనగని పేదోడి జీడిపప్పుగా వర్ణిస్తారు. వేరుశెనగ కాయలనుంచి లభించే నూనె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. రోజుకు గుప్పెడు వేరుశెనగలు తింటే శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. 25 గ్రాముల గింజల్లో 8 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి. ఇవి శరీరంలో కండరాలు, కొత్త కణాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులను అదుపులో పెట్టడమే కాదు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.
అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో వేరుశెనగ విత్తనాల్లో మేలు చేసే కొవ్వు (మోనో అన్ సాచురేటెడ్ ఫాట్) అధికంగా వున్నట్లు తేలింది. విత్తనాలు, నూనె, ఇంకా సంబంధిత వంటకాలు ఉండటంవల్ల గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం 21 శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. స్వచ్ఛమైన వేరుశెనగ నూనెలో లినోలెనిక్ యాసిడ్ 0.1 శాతం మాత్రమే వుంటుంది. కాగా కొన్ని కూరగాయలకు సంబంధించిన నూనెల్లో ఇది 7 శాతం వరకు ఉంటుంది. ఈ లినోలెనిక్ యాసిడ్ ట్యూమర్లకు కారణమవుతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.
త్వరగా మరిగే గుణం కారణంగా ఈ నూనెతో కూరలు వంటలు త్వరగా చేయవచ్చని, నూనెను బాగా మరిగించకుండానే కూరలు చేయవచ్చు. అంతేకాదు ఈ నూనెను తిరిగి వాడవచ్చు కూడా. ఇది వంటలో వాడినపుడు వాటి సువాసన రుచి పోకుండా ఆపుతుంది. అంతేకాకుండా పదార్థాలు ఎక్కువ నూనెని పీల్చుకోవు. ఈ నూనె రూమ్ టెంపరేచర్‌లో ద్రవ రూ పంలోనే వుంటుంది. దీనిలో వుండే మాంసకృతులు, పీచు, పిండి పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసే శక్తి వీటికి ఉన్నాయి. వేరుశెనగలను నేరుగా తిన్నా, వేరే విధంగా తిన్నా ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీటివల్ల కండరాలు పటిష్టంగా ఉండడంతోపాటు గుండె జబ్బులు రాకుండా చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రధానంగా వంటల్లో వేరుశెనగ నూనెను అమితంగా వాడుతారు. నూనె గింజల పంటల్లో వేరుశెనగ చాలా ప్రధానమైనది. మన దేశంలో 6.7 మిలియన్ హెక్టారులలో వీటిని సాగుచేస్తూ, 4.9 మిలియన్ టన్నుల దిగుబడి సాధిస్తున్నారు.
వేరుశెనగ మంచి పోషక విలువలున్న నూనె గింజల పంట. వేరుశెనగ గింజలో 45-50 శాతం మాంసకృతులు, 26.1 శాతం పిండి పదార్థాలు, 3 శాతం పీచు పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా మనకు అవసరమైన ఆమ్లాలు, లైసిన్, త్రియోనైస్, వాలిన్, మిథియానైన్, సిస్టిన్, లూయసిన్, ఐసోల్యూషన్ ఫినైల్ అలనైన్, తైరోసిన్ కూడా పుష్కలంగా వుంటాయి. వెనుశెనగ నూనెలో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, మాంసకృతులు తక్కువగా ఉంటాయి. గుండె జబ్బులతో బాధపడేవారు కూడా ఈ నూనెను క్షేమంగా వాడొచ్చు. వేరుశెనగ నేరుగా ఆహారంతోనూ, ఏ ఇతర పదార్థాలతో కలిపిగానీ తీసుకోవచ్చు. పేద కుటుంబాల పిల్లలలో ప్రొటీన్లు కేలరీల లోపం స్పష్టంగా కనబడుతుంది. ఈ లోపాన్ని అధిగమించాలంటే వేరుశెనగ గింజలు తీసుకోవటమే అందుబాటులో వున్న చౌకైన మార్గం.
వేరుశెనగ పంటలో దాదాపు 80 శాతం వరకు నూనె కోసం వినియోగిస్తారు. నూనె తీయగా మిగిలిన చెక్కను ఎరువుగాను, పశువుల దాణాగా వాడుతారు. ఇంకా వేరుశెనగ నూనెలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. చర్మానికి రక్షణగా నిలుస్తుంది. కనుక వేరుశెనగ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు. అధిక ఉష్ణోగ్రత వద్ద చేసే వంటకాలకు ఇది అనువైనది.
యాంటీ ఆక్సిడెంట్లు, పైటోస్టెరోల్స్ ఉండడంవల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. కొలన్, బ్రెస్ట్, ప్రోస్టేట్ కేన్సర్లనుంచి రక్షణకు వేరుశెనగ నూనె వాడుకోతగినది. వేరుశెనగ గింజలను స్వయం గా నూనె పట్టించి వాడుకోవటం కంటే కంపెనీలు విక్రయించే నూనె ను వాడుకోవడం మంచిది. ఎందుకంటే అలెర్జీకి దారితీసే ప్రొటీన్‌ను కంపెనీలు ప్రాసెస్ చేసే సమయంలో తొలగిస్తాయట.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి