ఐడియా

పొగ.. కళ్లకు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక ఉష్ణోగ్రతపై వంట చేసేటపుడు ఉత్పన్నమయ్యే పొగ వల్ల కంటిశుక్లం సరిగా పనిచేయదు. నూనెతో కూరలు వండేటపుడు విడుదలయ్యే పొగ వల్ల కార్భన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ తదితరమైనవి విడుదలవుతాయి. ఇవి పొగలో కలిసి కంటి శుక్లానికి హానిచేస్తాయ.

పొగ.. కళ్లకు ఎంతో చేటు తెస్తుంది. ఈ కాలుష్యకారకమైన పొగ కంటి శుక్లం పెరగకుండా చేస్తుంది. ఈ పొగ పరిశ్రమలది కావచ్చు.. సిగరెట్‌ది కావచ్చు.. గ్యాస్ పొయ్యి మీద వంట చేసేటపుడు వెలువడే పొగ కావచ్చు. కళ్లకు సంబంధించిన వ్యాధులు ప్రబలటానికి ప్రధాన కారణమవుతోంది. అందుకే ఇంట్లో వంట చేసేటపుడు పొగ కళ్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు శ్రీగంగారామ్ ఆసుపత్రికి చెందిన కంటి విభాగం నిపుణులు డాక్టర్ ఎ.కె.గ్రోవర్. ఆయన ఆధ్వర్యంలో గ్యాస్ పొయ్య నుంచి వెలువడే పొగ వల్ల కళ్లకు కలిగే హానిపై పరిశోధనలు జరిగాయి. గతంలోకట్టెల పొయ్యిపై వంట చేసేటపుడు ఆ పొగకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయని ఆందోళనచెందేవాళ్లం. కాని గ్యాస్ పొయ్యిపై వంట చేసేటపుడు వచ్చే పొగ సైతం కళ్లకు తీవ్రమైన చేటు తెస్తోంది. వంటింటికి సరైన వెంటిలేషన్ లేకపోతే కళ్లు దెబ్బతింటాయని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతపై వంట చేసేటపుడు ఉత్పన్నమయ్యే విషపదార్థాల పొగ వల్ల కంటిశుక్లం సరిగా పనిచేయదు. నూనెతో కూరలు వండేటపుడు విడుదలయ్యే పొగ వల్ల కార్గినోజెన్స్, కార్భన్ మోనోక్సైడ్, హైడ్రోకార్బన్స్ వంటి విషపదార్థాలు విడుదలవుతాయి. ఇవి కళ్లలోకి వెళ్లి కంటిశుక్లం అభివృద్ధిని నిరోధిస్తుంది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ వల్లే కాకుండా ఆధునిక ఇళ్లలో సరైన వెంటిలేషన్ లేకపోవటం వల్ల వంట చేసేటపుడు వచ్చే పొగ వల్ల కూడా కంటి శుక్లానికి తీవ్రమైన దెబ్బ అని శ్రీగంగారామ్ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ఎ.కె. గ్రోవర్ వెల్లడిస్తున్నారు.
కంటి కటకాలకు సంబంధించిన మార్పులు కూడా సంభవిస్తాయని చెబుతున్నారు. కాలుష్య కారకాల నుంచి కంటిశుక్లాన్ని సంరక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మూడు వందల కోట్ల మంది ఇంకా బొగ్గు, కర్రలతో వంట చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మనదేశంలోనూ, నేపాల్ వంటి దేశాలలో వంటిళ్లల్లో చిమీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం లేదు. గాలి ప్రసరణ సరిగాలేక వంట చేసేటపడు వెలువడే పొగ కళ్లకు ఇబ్బందులు కలుగుజేస్తున్నాయని అంటున్నారు. దీర్ఘకాలంలో ఈ పొగ వల్ల కంటిశుక్లంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. వంటలలో నూనె పదార్థాలు అధికంగా వాడవద్దని సూచిస్తున్నారు. అలాగే మధుమేహం, రక్తపోటు వంటివి సంభవించకుండా ఆహారనియంత్రణ పాటించాలని చెబుతున్నారు. వంట చేసేటపుడు కళ్లకు పొగకు తగలకుండా తగిన రక్షణ కవచాలు ఏర్పాటుచేసుకుంటే మంచిది. ముఖ్యంగా వంట చేసేది అధికశాతం మహిళలే కాబట్టి వారు తరుచూ కంటిశుక్లం పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.