ఐడియా

‘బ్రేక్‌ఫాస్ట్’తో ఆరోగ్యరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ కావద్దన్నది వైద్య నిపుణుల వాదన. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో తేలిందేమంటే..బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోని వారికి గుండెపోటు లేదా ప్రాణాపాయ ముప్పు 27 శాతం ఎక్కువగా వుందని. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఆకలి బాగా పెరిగిపోతుంది. దాంతో మధ్యాహ్నం తీసుకునే లంచ్ పరిమాణం అధికమవుతుంది. ఇది బ్లడ్ సుగర్ పెరగడానికి దారితీస్తుంది. దీనివల్ల డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, అధిక కొలస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో గుండెకు ముప్పు ఏర్పడుతుంది.

ఉదయం..మధ్యాహ్నం...రాత్రి.ఏం తీసుకోవాలి?

ఉదయం తీసుకునే ఆహారం శరీరంలో బ్లడ్ సుగర్ పరిమాణాలు మిగిలిన రోజంతా ఎలా వుండాలన్నది నిర్ణయిస్తుందట. హోల్‌గ్రెయిన్, కొంత ఫ్యాట్, ప్రోటీన్ వున్న ఆహారం తీసుకుంటే బ్లడ్ సుగర్ నిదానంగాపెరిగి నిదానంగా తగ్గుతుంది. రిఫైన్డ్, అధికంగా తీపి వుండే పదార్ధాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోయి ఆ తర్వాత మరింత తక్కువ స్థాయికి తగ్గిపోతాయి. దాంతో మళ్లీ ఆకలి వేస్తుంది. ఫలితంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటుకు దారి తీస్తుంది. అందుకే శరీరంలో బ్లడ్ సుగర్ ఒకే రీతిలో వుండేందుకు వీలుగా ఉదయం ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. లేదంటే ఆమ్లెట్, పాలకూర, అవకాడో తీసుకోవచ్చు.
నిజానికి బ్రేక్‌ఫాస్ట్‌ను కింగ్ సైజు తినాలని చెబుతారు. లంచ్ అనేది ప్రిన్స్‌లా, డిన్నర్‌ఈ రెండింటి కంటే తక్కువ పరిమాణంలో వుండాలంటారు పరిశోధకులు. సాధారణంగా రోజులో ఉదయంనుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రిళ్లు విశ్రాంతికి వెడతాం కనుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవాలి. ఒకవేళ లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగకా తీసుకోక తప్పని పరిస్థితిలో వున్నవారు కనీసం డిన్నర్‌లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు వుండేలా చూసుకోవాలి. కూరగాయలు సలాడ్ ఎక్కువగా తీసుకోవాలి.
నిద్రకు సమయం దగ్గర పడుతున్న వేళల్లో తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా వుంటే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో నిద్ర తొందరగా రాదు. పట్టినా ఆ నిద్ర అంత గాఢంగా వుండదు. ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత ఇంకే ఆహారం తీసుకోవద్దు. కొందరు తియ్యటి పదార్ధాలు, ఫ్రిజ్‌లోనుం ఐస్‌క్రీమ్ తీసుకుని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. చక్కెర స్థాయి బాగా పెరిగిపోతాయి. ఇవి మెలటోనిన్ అనే హార్మోన్‌ను తక్కువ చేస్తాయి. ఈ హార్మోనే అలసిపోయినట్టు, విశ్రాంతి భావనలను కలిగించేది. ఈ హార్మోన్ తగ్గడంవల్ల మెదడుకు సంకేతాలు సరిగా వుండవు. దాంతో నిద్ర రమ్మన్నా రాదు.
ఉదయం 6-7 గంటల మధ్య
ఉదయం ఎర్లీగా లేవడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్పే మాట. ఉదయం లేచిన వెంటనే 6-7 గంటల మధ్య ఓ గ్లాస్ నీటిని తాగడంవల్ల శరీరంలో నీటి సమతుల్యత ఏర్పడుతుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే జపాన్‌లో సగటు ఓ వ్యక్తి ఆయుర్దాయం రెండున్నరేళ్లు అధికంగా వుంది. అక్కడ నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల నీరు తాగే అలవాటు చాలామందిలో ఉంది. నీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలం నుంచి వున్న కీళ్ల నెప్పులు ఉపశమించడంతోపాటు కేన్సర్ల నియంత్రణకు వీలు పడుతుందట.
7 గంటలకు
నిద్ర లేచిన తర్వాత అరగంటనుంచి గంటలోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియలు మొదలవుతాయి. కడుపు నిండిపోతుంది కనుక ఇతర ఆహారం వైపు చూడరు.
9-10 గంటల మధ్య
నచ్చిన చాక్లెట్‌ను తినడానికి అనువైన సమయం ఇది. చాక్లెట్ ద్వారా కార్బోహైడ్రేట్లు, షుగర్ అధిక మోతాదులో శరీరంలోకి చేరతాయి. స్వీట్ తినడానికి ఉదయమే సరైన సమయమని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకుల మాట. ఇది జీవక్రియలను ఉత్సాహపరుస్తుందట.
కాఫీ ఎప్పుడు?
ఉదయం బెడ్ కాఫీ తీసుకోవడం చాలామందిలో ఉండొచ్చు. కానీ పరిశోధకులు మాత్రం కాఫీ లేదా టీ తాగేందుకు ఉదయం 10 గం టలనుంచి మధ్యాహ్నం వరకు అనువైనదని చెబుతారు. పొద్దునే్న లేచిన వెంటనే కాఫీ, టీలు తీసుకోవడం వల్ల ఇందులో వుండే కెఫైన్‌కు శరీరం అనువుగా మారుతుంది. దాంతో ఇది సహజంగా మన శరీరానికి శక్తినిచ్చే కార్టిసోల్ హార్మోన్‌ను తగ్గించేస్తుంది. ఉదయం 10 గంలు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యవీటిని తాగేందుకు అనువైన సమయం.