ఐడియా

శీతాకాలంలో పిల్లలు జాగ్రత్త..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలం చలిగాలులు ఆరంభమయ్యాయి. గాలులు మధురానుభూతితో పాటు వ్యాధులను మోసుకొస్తాయి. ఈ కాలంలో పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు అధికంగా వస్తాయి. వీటితో జలుబు, దగ్గు, జ్వరం, పెద్దవాళ్లకు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వారి దుస్తులు, ఆహారపానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పిల్లలకు స్నానం చేయించేముందు కొబ్బరి నూనె రాయండి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
చల్లగా ఉందని మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు పోయండి. ఈ కాలంలో పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగరు. కాని మనమే వారిచేత నీళ్లు తాగించాలి.
స్కూలు నుంచి రాగానే చేతులను శుభ్రంగా కడుక్కోమని పిల్లలకు చెప్పండి. గోరువెచ్చని నీళ్లు, సబ్బుతో కడుక్కుంటే క్రిముల బెడద నుంచి రక్షించబడతారు.
జంక్‌ఫుడ్‌కు దూరం గా ఉంచండి. వేళకు తిన టం, పడుకునేలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
స్కూల్లో జలుబు, జ్వరంతో ఇబ్బందిపడుతున్నవారి ఆహార పదార్థాలను పంచుకోవద్దని చెప్పాలి. సహజంగా పిల్లల్లో తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలను పంచుకుతింటారు.