ఐడియా

సోయా ఒక వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిబిడ్డలకు సోయా పాలు మంచి అనువైన ఆహారం. పిల్లలు డెయిరీ పాలల్లో వుండే లాక్టోజును గ్రహించి జీర్ణం చేసుకునే శక్తి సన్నగిల్లుతోంది. ఫలితంగా అనేక రకాల ఉదర సంబంధ రుగ్మతలకు గురవుతున్నారన్నది ఒక అధ్యయనం. వయసుమీదపడే కొలది ఎముకల్లో శక్తి సన్నగిల్లుతూ కణ నిర్మాణం సడలుతుండటాన్ని శాస్ర్తియంగా ఆస్టయోపోరోసిస్ లక్షణాలుగా గుర్తిస్తారు. దీనివల్ల తొంటి ఎముకలు విరగడం, కీళ్ళ సంబంధ బాధలు పెరుగుతాయ. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. సోయాలోని మాంసకృతులవలన ఏర్పడే కాల్షియం సక్రమంగా వినియోగింపబడి త్వరగా ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా కాపాడుతుంది. సోయా ఉత్పత్తుల వినిమయం వల్ల మెనోపాజ్ (రుతుస్రావ స్తంభన) లక్షణాలను తగ్గిస్తుంది. నడుము నొప్పులు, ఉన్నట్టుండి చెమటలు పట్టడం, చిరాకు, కండరాల నొప్పులు వంటి అసౌకర్యాలనుంచి ఉపశమనం లభిస్తుంది. స్ర్తిలకు సోయా ఒక వరం అని చెప్పొచ్చు. సోయాబీన్‌లో సహజంగా వుండే ‘ఐసోఫ్లావిన్స్’ ప్రోస్టేట్ సమస్యలను, రొమ్ము కాన్సర్ వంటి తీవ్ర రుగ్మతలను నిలువరిస్తుంది. శరీరానికి సోకే అవకాశం వున్న వివిధ రకాల కాన్సర్ కారకాల బారిన పడకుండా రక్షించడంలో ఐసోప్లావిన్స్ పాత్ర కీలకమైనది.