ఐడియా

చక్కెర ఎక్కువైతే అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు రోజువారీ ఆహారంలో అదనంగా చక్కెరను తీసుకోవడమే అనర్థాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. యాడెడ్ షుగర్‌లో ఎలాంటి పోషకాలు కేవలం తక్షణం శక్తినిచ్చే కేలరీలు మాత్రమే ఉన్నాయి. పైగా పళ్లకు హానికరం. ఎందుకంటే తీపి పదార్థాలు పళ్ల దగ్గర ఆగడంవల్ల ఆ సుకోజ్ చుట్టూ బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో పళ్లు పుచ్చిపోతాయి. అందుకే ఏ పదార్థం తిన్నా వెంటనే నీరు పుక్కిలించి వదలమని చెబుతుంటారు. ఆరోగ్యవంతులైనవారు, చురుగ్గా ఉండేవారు అదనపు షుగర్ తీసుకోవడవంల్ల దుష్ప్రభవాలు తక్కువగా ఉంటాయి. అదే చురుగ్గా లేనివారు, అధిక కార్బో హైడ్రేట్లు, అధిక కేలరీలతో కూడిన పాశ్చాత్య ఆహారాన్ని తీసుకోవడంవల్ల వారికి ముప్పు ఎక్కువ ఉంటుందని నిపుణుల హెచ్చరిక. ఇన్సులిన్ శరీరానికి చాలా అవసరం. రక్తం నుంచి కణాలకు గ్లూకోజ్ వెళ్ళేందుకు ఇన్సులిన్ కీలకంగా వ్యవహరిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే అది మధుమేహం, కంటిచూపు తగ్గడానికి దారితీస్తుంది. జీవక్రియలు గతి తప్పితే ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయదు. దాంతో కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌గా మారతాయి. దీంతో ఊబకాయం, కార్డియో వాస్క్యులర్, టైప్ 2 డయాబెటిస్, కేన్సర్ వ్యాధుల బారిన పడవచ్చు.