ఐడియా

పసి పిల్లల పోషణ..అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల పెంపకం నేడు తల్లులకు సవాల్‌గా మారుతోంది. ఏడాది లోపు పిల్లలకు తల్లిపాలే ఎంతో మంచివి. వారికి బుద్ధికుశలత పెరుగుతుంది. ఆస్తమా, ఎలర్జీలను నుంచి బిడ్డలను కాపాడుకోవచ్చు. నెలల బిడ్డకు తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చు. దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. కానీ విటమిన్ డి తగినంత అందదు. అందుకే వీరిని ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో కొంత సేపు ఎండలో ఉంచితే విటమిన్ డి అందుతుంది. లేదంటే విటమిన్ డి చుక్కల మందు రూపంలో అందించాలి.
అలానే ఐరన్ కూడా వీరికి తగినంత అందదు. అందుకే వైద్యులు ఐరన్,జింక్ విటమిన్స్ కూడిన డ్రాప్స్‌ను సూచిస్తుంటారు. నెలల బిడ్డలకు పోషకాహారం అందాలంటే తల్లులు కూడా పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది వయసు నుంచి పిల్లలు తోటి కుటుంబ సభ్యులు తినే వాటినే అనురిస్తుంటారు. కుటుంబ సభ్యుల ఆహారపు అలవాట్లు వారిపై ప్రభావం చూపిస్తాయి. ఏడాది తరువాత పాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. తల్లిపాలే సరిపోవు కనుక విడిగా పాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎముకులు, దంతాలకు కాల్షియం చాలా అవసరం. శరీర నిర్మాణంలో కండరాలతో పాటు ఎముకలకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది.
ఒకవేళ పాలతో అలర్జీ ఉండి, పిల్లలు తీసుకోకపోతే సోయామిల్క్, క్యాల్షియం సప్లిమెంట్లను కూడా సూచించొచ్చు. అలాగే పీచు పదార్థం చాలా అవసరం. ఇచ్చే ఆహారంలో ఇది తగినంత ఉండాలి. పిల్లలకు ఫ్యాట్ అవసరమే కానీ పరిమితి దాటకూడదు. అందుకే తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం ఇస్తే సరిపోతుంది. అలాగే, తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్‌ఫ్యాట్ ఉండేలా శ్రద్ధ వహించాలి.