ఐడియా

పగిలిన మడమలు అందంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగిలిన మడమల సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. కొన్నిసార్లు ఈ పగుళ్ళు చాలాలోతుగా తయారై నడవడానికి ఇబ్బంది కలుగుతుంది. పాదాలను నిర్లక్ష్యం చేయడం, ఎక్కువ సేపు నిల్చోవడం, సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల పగుళ్ళు ఏర్పడతాయి. ఎగ్జిమా, సోరియాసిస్, థైరాయిడ్, మదుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా కాళ్ళు పగులుతాయి. చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల పాదాలు పగుళ్ళు తగ్గి అందంగా తయారవుతాయి.
* నిమ్మరసం చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి పదిహేను నిముషాలపాటు పాదాలను అందులో ఉంచి పగులు ఉన్న చోట స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. తరువాత క్రీమ్ పట్టించాలి. ఇలా తరచుగా చేస్తూండటం వల్ల పాదాల పగుళ్ళు తొలగిపోతాయి.
* గ్లిజరిన్, రోజ్ వాటర్‌ను సమాన నిష్పత్తిలో తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పగుళ్ళపై రాస్తే క్రమంగా పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.
* పెట్రోలియం జెల్లీ, నిమ్మరసాలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు పగుళ్ళకు రాసుకుని పడుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పాదాల పగుళ్ళు మాయం అవుతాయి. మృదువుగా తయారవుతాయి.
* పగుళ్ళకు ఆలివ్ ఆయిల్‌ను రాసి మసాజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. అలాగే కొబ్బరినూనెను కూడా పగుళ్ళపై రాయవచ్చు.
* అలోవెరా జెల్‌ను క్రమం తప్పకుండా పగుళ్ళపై రాయడం వల్ల పగుళ్ళు మాయమై పాదాలు అందంగా ఉంటాయి.
*