ఐడియా

కేలరీలపై కనే్నయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటితరం అమ్మాయిలు పోషకాహారం అంటూనే అవకాడో, ఓట్‌మీల్, క్వినోవా, మయోనైజ్‌డ్, డార్క్ చాక్లెట్స్, నట్స్, డ్రైట్ కోక్స్ వంటివాటిని ఎక్కువగా తింటూ శరీరంలో కేలరీలను పెంచేసుకుంటున్నారు. ఇవన్నీ బరువుపెంచే ఆహారాలే.. సమయాను కూలంగా, వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆహారాన్ని ఎంచుకోవాలి. ఋతువులను అనుసరించి వచ్చే పండ్లు, కూరగాయలను తిన్నప్పుడు మాత్రమే శరీరానికి తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటామనేది పరిశోధకులు, పోషకాహార నిపుణులు చెబుతున్న నిజం.
* వయసూ, బరువును బట్టి మాత్రమే ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక మహిళ రోజుకి సగటున అరవై్ర గాముల పప్పు దినుసులు, యాభై గ్రాముల వరకూ మాంసాహారాన్ని తీసుకోవచ్చు.
* చీజ్, బటర్, పీనట్ బటర్, నెయ్యి వంటివాటిని రోజుకు ఒక టీస్పూన్ పరిమాణంలో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇందులో నెయ్యి మినహాయింపు. ఎందుకంటే నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు. అలాగని కప్పులు కప్పులు లాగించేయకూడదు సుమా..
* అన్నం, రాగులు, జొన్నలు, గోధుమలు, చిరుధాన్యాలు.. ఇలా ఏవైనా రోజుకు మూడు వందల గ్రాములను మించకుండా తీసుకోవడం మంచిది.
* ఓ మహిళ రోజుకి సగటున వంద గ్రాముల పండ్లూ, రెండు వందల గ్రాముల కూరగాయలు తీసుకోవాలి.
* పంచదారను రోజుకి ఇరవైగ్రాములకు మించకుండా చూసుకోవాలి. తీపిపదార్థాలు అంటే స్వీట్లు, చాక్లెట్లు తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అలాగే మైదాను కూడా ఎక్కువగా తీసుకోకూడదు.
* నూనెను రోజుకు ముప్ఫై ఎమ్. ఎల్‌కు మించకుండా అంటే మూడు టీ స్పూన్‌లకు మించకుండా చూసుకోవాలి.
* పెరుగు, పనీర్‌లను అవసరానికి మించి తీసుకోకూడదు.
ఇలా ఆహారపదార్థాల్లోని కేలరీలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం వల్ల శరీరం అధిక బరువు పెరగకుండా, ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.
*