ఐడియా

ఐడియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ముదిరిపోయిన ఆనపగింజల్ని బియ్యంతో కలిపి నానేసి రుబ్బి, దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
*బియ్యంలో కొంచెం మెంతులు కలిపి రుబ్బితే దోసెలు గట్టిగా ఉంటాయి.
*మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర, కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగానో, చిప్స్‌గానో పెట్టుకొని ఎండాక వేయించుకుని తింటే రుచిగా ఉంటాయి.
*పూరీ పిండి కలిపేటపుడు కొంచెం చెక్కర కలిపితే పూరీలు చాలా సేపటివరకు తాజాగా ఉంటాయి.
*అరకిలో గోధుమ పిండికి రెండు మగ్గిన అరటిపళ్లు, ఒక కప్పు పెరుగు కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.
*పకోడీల పిండికి కొంచెం బేకింగ్ పౌడర్‌గానీ, వేడి నూనెగానీ కలిపితే పకోడీలు లావుగా కరకరలాడతాయి.
*పప్పులు గానీ, బియ్యంగానీ నానాబోయాల్సి వస్తే వేడినీళ్లలో నానబోస్తే మంచిది.