Others

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరం అదుపులో ఉండాలంటే..!
ఉరుకుల పరుగుల బిజీలైఫ్‌లో మనిషి డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదనేది వాస్తవం. దీనితో శరీరం అదుపుతప్పి భారీగా మారడమో, అస్తిపంజరంలా మారడమో జరుగుతూ ఉంది. సరైన వ్యాయామం లేకపోవడం సరైన ఆహార నియమాలు లోపించడం దీనికి కారణం.
అలసిన శరీరానికి చాలినంత నిద్ర అవసరం. పని వత్తిడితో నిద్రకు దూరమైతే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోవడమే.
కార్పోహైడ్రేట్స్ ఉండే ఆహారం బాగా తీసుకోవాలి.
ఉదయం సాయంత్రం సమయాల్లో అల్పాహారం, స్వల్పాహారం తీసుకోవడం మంచిది.
తినే సమయంలో ఆఫీసు వత్తిడులు గుర్తుతెచ్చుకోకూడదు. ఆనందంగా, పక్కనెవరైనా వుంటే హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ తినాలి.
టీవీ ముందర కూచుని వాటిలో లీనమైపోయి ఆహారం తీసుకోవడం మంచిది కాదు.
ఊబకాయం వచ్చే పరిస్థితులు కనపడితే రోజూ ఓ అరగంట నడవటం మంచిది. ఆఫీసు దగ్గరైతే వాకింగ్ బెటర్.
మాటిమాటికీ లిఫ్ట్ వాడక మెట్లదారిని నడవడం కొంత వరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఇంటిపట్టున వుండి ఊబకాయం వచ్చే మహిళలు ఇంటి పనికి, వంట పనికి పనివాళ్లను పెట్టుకోకుండా స్వంతంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం పొదుపునకు పొదుపు కలిసొస్తాయి.

-కైపు ఆదిశేషారెడ్డి