ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరలన్నింటిలోనూ మహిళల పాలిట వరం మెంతికూర అని చెప్పొచ్చు. ముఖ్యంగా గర్భిణులు దీన్ని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకున్నా మంచిదే. గర్భస్థ శిశువు ఎదుగుదలకు మెంతిలోని విలువైన పోషకాలు దోహదపడతాయి. బాలింతలు మెంతికూర తింటే శిశువులకు తల్లిపాలు తగినంతగా లభిస్తాయి. నెలసరికి ముందు, తర్వాత కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే మహిళలు తరచూ ఆహారంలో మెంతికూర తింటే ఉపశమనం కలుగుతుంది. మెంతి ఆకుల్లో ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి గనుక రక్తహీనత నుంచి నివారణ లభిస్తుంది. టమాటాలతో కలిపి మెంతికూర వండితే విటమిన్-సితో పాటు మంచి పోషకాలు శరీరానికి అందుతాయి. నీరసం, ఒత్తిడులకు ఇది విరుగుడుగా పనిచేస్తూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు ఎదుర్కొనే హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. మెంతి ఆకులను ముద్దగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయానే్న చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, నల్లమచ్చలు, చర్మంపై ముడతలు క్రమంగా అదృశ్యమవుతాయి.