ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో అరటిపండును ‘పేదవాడి ఆపిల్’ అంటారు. ఈ రెండు పండ్లూ మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. ధర పరంగా చూస్తే ఆపిల్ ఖరీదైనది, అరటి పండు చవకైనది. ఏడాది పొడవునా పుష్కలంగా లభించే అరటి పండ్లలో పోషక పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది త్వరగా జీర్ణమైపోయి శక్తిని ఇస్తుంది. సంపూర్ణాహారమైనందున ఎదుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది. చాలామంది భోజనం చేశాక అరటి పండును విధిగా తింటారు. అరటిలో రెండు రకాలున్నాయి. ఒకటి పండించి తినడానికి, రెండో రకం కేవలం కూరగా వండుకోవడానికి ఉపయోగపడేవి. కూర అరటితో పలురకాల వంటకాలు, బజ్జీలు, చిప్స్ వంటివి చేస్తారు. అరటి పువ్వు, దవ్వను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. అరటి ఆకుల్ని భోజనం చేసేందుకు వాడతారు.
అరటిపండులో 75 శాతం వరకూ నీరు గుజ్జు రూపంలో వుంటుంది. పండే కొద్దీ గుజ్జు మరింత మెత్తగా మారుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి శక్తిని ఇస్తాయి. పెద్దపేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. పీచు పదార్థం, మెగ్నీషియమ్ పుష్కలంగా వున్నందున మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు. ఇందులోని పొటాషియం కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి రెండు, మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడిన వాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.