ఐడియా

దోశ తెచ్చిన దర్జా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దోశ’ నోరూరించే ఆహారపదార్దం కాదంటారు. ఓ భావోద్వేగం అని దక్షిణాది ప్రజలు భావిస్తారు. ఈ భావోద్వేగంతోనే ఆ యువకుడు దోశ విప్లవం తీసుకువచ్చాడు. ఓ రెస్టారెం ట్‌కు యజమాని అయ్యాడంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ!. కాని ఇది వాస్తవం. వివరాల్లోకి వెళితే..

నాంపల్లి రైల్వేస్టేషన్ ముందు
ఇడ్లీ బండితోప్రయాణం
బంజారాహిల్స్‌లో
ఏసీ రెస్టారెంట్ ఏర్పాటు
రామ్‌కుమార్ షిండే సక్సెస్ స్టోరీ

రాత్రిళ్లు పనిచేస్తునే ఎంబిఏ
1989 నాటి సంగతి. రామ్‌కుమార్ షిండేకు అప్పుడు ఎనిమిదేళ్లుంటాయి. తండ్రి తోపుడు బండిమీద ఇడ్లీలు, దోశలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు నాంపల్లి రైల్వేస్టేషన్, మరోరోజు పంజాగుట్ట చౌరస్తా. ఇంకోరోజు మైత్రీవనం. అలా సాగేది అతడి బతుకు బండి. రామ్ తండ్రికి చేదోడు వాదోడుగా వుండేవాడు. రాత్రిళ్లు పనిచేస్తునే చదివాడు. కష్టపడి ఎంబిఏ పూర్తి చేశాడు. ఇప్పుడేం చేయాలి? ఉద్యోగం వెతుక్కోవడమా? లేదంటే నాన్న నడిపిన ఇడ్లీ బండి కంటిన్యూ చేయడమా? పెద్ద డైలమా. జాబ్ చేస్తే నెలకు 20వేలు సంపాదించొచ్చు. కానీ రామ్ మనసు ఉద్యోగం మీద లేదు. నాన్న అడుగుజాడల్లో నడవాలని, ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలని. ఇలా ఉండేవి అతని ఆలోచనలు. ఇడ్లీ బండి నడపటానికే మనసు మొగ్గు చూపింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేశాడు. రెగ్యులర్ దోశలు కాకుండా చీజ్ దోశ, పిజా దోశ, పన్నీర్ దోశ...ఇలా నోరూరించేలా వేసేవాడు.ఇంకేముంది నెల తిరక్కుండానే రామ్ బండికి కస్టమర్ల తాకిడి పెరిగింది. రాత్రి 11 తర్వాత సిటీలో తినడానికి అంతగా ఏమీ దొరకని టైంలో రామ్ బండి రారమ్మని పిలుస్తుంది. తెల్లవారుజామున మూడు గంటలకు బిజినెస్ మొదలవుతుంది. పొద్దున్న 8 వరకు బండి నడుస్తుంది. ఎంత లేదన్నా వెయ్యి మంచి వరకు తింటారు. అలా మొదలైన ఈ దోశ విప్లవం అతన్ని ఆర్థికంగా అందలం ఎక్కించింది.
బంజార్‌హిల్స్‌లో ఏసీ రెస్టారెంట్!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏసీ రెస్టారెంట్. రామ్స్ దోశ హౌజ్. నాంపల్లి ఇడ్లీబండి కుర్రాడే ఈ రెస్టారెంట్ ఏర్పాటుచేశాడు. వీఐపీలంతా ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీతో వస్తారు. తెలుగు సినిమా నటులంతా ఇక్కడ దోశ తినకుండా ఉండరు. కుర్రాళ్లంతా ఎగబడతారు. అమ్మాయిలు మరీను. వీకెండ్ అయితే కూర్చోడానికే క్యూలో వుంటారు. రామ్స్ దోశ హౌజ్‌లో 30మంది పనివాళ్లున్నారు.చెఫ్‌లకు నెలకు 30వేలనుంచి 40 వేల వేతనం ఇస్తుంటాడు. అంత పెద్ద రెస్టారెంట్ ఉందంటే, ఏ ఓనరైనా ఏం చేస్తాడు... హాయిగా కాలుమీద కాలేసుకుని వ్యాపారం చూసుకుంటాడు. కానీ రామ్ అలా కాదు. ఏ నాంపల్లి అయితే దారి చూపిందో...ఆ ఏరియాను ఇప్పటికీ వదల్లేదు. తెల్లవారు జామున రెండింటికే దోశబండితో రెడీ అయిపోతాడు. పొద్దున్న ఎనిమిది దాకా అక్కడే ఉంటాడు. సాయంత్రం రెస్టారెంటుకొస్తాడు. ఇంకో పది హోటళ్లు పెట్టినా, నాంపల్లిలో బండి పెట్టి పెనం మీద దోశ వేయడం మాత్రం మానను అంటాడు. అంతేకాదు రామ్ ఫేస్‌బుక్ ఫాలోవర్స్ యాభైవేలు పైచిలుకే.

తెల్లవారుజామున మూడింటికి నాంపల్లి రైల్వేస్టేషన్ ముందు ఆగండి. అక్కడ పొగలు కక్కే దోశబండి కనిపిస్తుంది. చుట్టు జనం ఎగబడుతు కనిపిస్తారు. ఎక్కడో ఉన్న హైటెక్ సిటీనుంచి పనిగట్టుకుని వస్తారు. అక్కడ ఓ యువకుడు వేసే దోశలు తినిపోతుంటారు.
****
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14, పార్క్ హయత్ ఎదురుగా ఒక లేన్. కాస్త లోపలికి వస్తే ఎడమవైపున రామ్స్ దోశ హౌజ్ అని గ్లాస్ కర్టెన్ రెస్టారెంట్ కనిపిస్తుంది. వాలెట్ పార్కింగ్‌లో అవుడి, బీఎండబ్ల్యు కార్లు పార్కు చేసి ఉంటాయి. కుర్రాళ్లు బయట నిలబబడి ఆర్డర్ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. అక్కడ కూడా నాంపల్లి యువకుడు కనిపిస్తాడు. ఇద్దరు ఒకటేనా? కవలలా అని ఆశ్చర్యం పోవటం మనవంతు అవుతుంది. రామ్స్ దోశ హౌజ్ మరెవరిదో కాదు. పైన చెప్పుకున్న నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా దోశ బండి నడిపే వ్యక్తిదే. ఆ రామే ఈ రాము.