ఐడియా

ఇట్లు ‘ఫ్రేము’తో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురక్షణాలను.. జీవితకాలం నిలిచిపోయేలా చేసేది ఫొటో, వాటిని మరింత అందంగా చూపగలిగేది ఫొటో ప్రేము. ఇప్పుడు రకరకాల ఫొటో ఫ్రేములు మార్కెట్‌లో తమకంటూ ప్రత్యేకమైన ఉనికిని క్రియేట్ చేసుకుంటున్నాయి. వుడెన్ ఫ్రేములు, స్టిక్‌ఫ్రేమ్స్, గ్లాస్ ఫ్రేమ్స్, రకరకాల ఫొటో ఫ్రేములు అందుబాటులో ఉంటున్నాయి. గోడలు ఖాళీగా కనిపిస్తే చాలు.. క్యాలెండర్లు, ఫొటోలు తగిలించేస్తుంటారు. దీనివల్ల గోడలకు ఎంత మంచి పెయింట్ వేసినా ఇల్లు అందవిహీనంగానే కనిపిస్తుంటుంది. ఫొటో ఫ్రేము ఇంటికి కొత్త సొబగులు అద్దుతూనే మనసుకూ ఆనందాన్ని పంచుతుంది, అందాన్ని తీసుకొచ్చేస్తుంది. తలచుకుంటే జీవితంలోని మరుపురాని క్షణాలకు వేదికగా ఇంటి గోడనే ఫ్రేముతో మలుచుకోండి. పెళ్లినాటి ఫొటోలు మొదలు ఆత్మీయతకు ఆలవాలంగా ఉన్న ప్రతి ఫ్రేమ్‌ను స్టిక్ చేయండి. ఒక క్రమ పద్ధతిలో కాకుండా జంబ్లింగ్ పద్ధతిలో ఏర్పాటుచేయండి. ఫ్యామిలీ ఫొటోలను చెట్టు ఆకారం వచ్చేలా, కొమ్మకు వేలాడదీసినట్టుగా, పిల్లల ఫొటోలను కామిక్ క్యారెక్టర్ రూపం వచ్చేలా అరేంజ్ చేసి చూడండి. ఫొటోల ఫ్రేములు తరుచూ శుభ్రం చేయడం మరచిపోవద్దు. ఫొటో ఫ్రేములపైన సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవడం మంచిది. ఎండ నేరుగా పడడంవల్ల ఫేడ్ అయిపోయి డల్‌గా కనిపిస్తాయి. ఎదురుగా ఉండే గోడకు కిటికీలు లేకుండా జాగ్రత్తపడటం మంచిది.
తర్వాత ఫ్రేములు ఎక్కువ కాలం మన్నడంతోపాటు కొత్తగా కనిపిస్తాయి. డైమండ్, చతురస్రం, దీర్ఘచతురస్రం.. ఇలా పలు రకాల షేపుల్లో గోడలపై అమర్చుకుంటే మరింత ఆకర్షణీయంగా ఫొటోలు కనిపిస్తూ ఇంటి అందాన్ని పెంచుతాయి.

- తరిగొప్పుల విల్లెన్ మూర్తి