ఐడియా

కొబ్బరి నీళ్లతో లాభాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవితాపం బాగా పెరిగిపోయింది. ఉక్కపోత వేధిస్తుంది. ధారాపాతంగా చమట రావడంతో నీరసం వస్తుంది. శరీరంలో శక్తినిచ్చే ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడంతో ప్రమాదం ముంచుకొస్తుంది. రక్తంలో నీటిశాతం తగ్గిపోతే డీహైడ్రేషన్ అంటారు. ఒక్కోసారి అది ప్రాణహానికి దారితీస్తుంది. అందుకే రక్తంలోని ప్లాస్మాలా పనిచేసే కొబ్బరినీళ్లు వేసవిలో దివ్యౌషధం అనే చెప్పాలి. క్రీడాకారులు వాడే స్పోర్ట్స్ డ్రింక్స్ కన్నా కొబ్బరినీళ్లే ఎక్కువ శక్తినిస్తాయి. వీటిలో సహజసిద్ధంగా ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల మంచి ఫలితం వస్తుంది. రక్తంలో నేరుగా కలవడంవల్ల అతి తక్కువ సమయంలోనే కొబ్బరినీళ్లు తాగినవారికి శక్తి వస్తుంది. దాహార్తినుంచి ఉపశమనం లభిస్తుంది. మనిషికి శక్తినిచ్చే ఖనిజలవణాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, కాల్షియం, ఫాస్పేట్, బైకార్బొనేట్, కాపర్ వంటివి ఇందు లో పుష్కలంగా ఉన్నా యి. ముఖ్యంగా పొటాషియం అధికపాళ్లలో ఉండ టం ఎంతో ప్రయోజనకరం. రక్తపోటు నియంత్రణ, బరు వు తగ్గడం, దాహం తీరడం, తక్షణం శక్తి అందడం, మేనికి మెరుపురావడం, చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడ, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం, ఉదర సం బంధ సమస్యలు తగ్గడం కొబ్బరినీళ్లతో సాధ్యమవుతుంది. కల్తీలేని, తక్షణం శక్తిని ఇచ్చే మరో పానీయం లేదనే చెప్పాలి. అందుకే ఎండలు మండిపోతున్న వేళ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా కొబ్బరినీళ్లను తాగి తే ఆరో గ్యం పదిలంగా ఉం టుంది.