ఐడియా

పిల్లల్లోనూ భావోద్వేగాలు ఉంటాయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దలకే కాదు పిల్లలకు భావోద్వేగాలు ఉంటాయ. పెద్దలు నవ్విస్తే నవ్వుతారు, కోపం ప్రదర్శిస్తే ఏడుస్తారు. కనుక చిన్నారులను చిరునవ్వుతో పెద్దలు ప్రతినిత్యం పలకరిస్తే తమను దూరం పెట్టటల్లేదని భావించి మానసికోల్లాసంతో ఎదుగుతారు. కొందరు పెద్దలు పిల్లలపట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇది చాలా తప్పు. పిల్లలను ప్రేమగా లాలించాలి. అల్లరి చేసే పిల్లలు, ఆటలాడే పిల్లలు, బొమ్మలు వేసుకునే పిల్లలు- ఇలా రకరకాల ధోరణులలో పిల్లలుంటారు. వారిని మనం గమనించాలి. నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులు కావాలంటే అందుకు తల్లిదండ్రులు కూడా తమ వంతు కృషిచేయాలి. గంపెడు పుస్తకాలిచ్చి కానె్వంట్లలోకి పంపించేయడం కాదు, కనీసం వారానికి ఒకసారి లేదా పక్షంరోజులకొకసారి తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వారి జీవనశైలి ఎలా వుందో కాస్త గమనించాలి. డ్రాయింగ్, ఆటల్లో ఆసక్తి ఉందో లేదో పరిశీలించాలి. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు కదా! కనుక వారిని లాలించి, బుజ్జగించి మంచి అలవాట్లు నేర్పించాలి. అంతేకానీ పిల్లల్ని చీటికిమాటికి కసురుకోరాదు. విసుక్కోరాదు. పిల్లల్ని ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులే. ప్రేమగా, ఆప్యాయంగా చూడవలసింది చిన్న వయసులోనే. వారి వారి ఇష్టాయిష్టాలకనుగుణంగా మలచుకోవాలి. భావి జీవితం పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలి. తల్లిదండ్రులు ప్రతినిత్యం ఎంతో బిజీగా వుండే రోజులు, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఇక వారిద్దరూ ఇంటికి వచ్చేది రాత్రికే. పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఎదురుచూసే ప పరిస్థితి. ఇటువంటివి లేకుండా వారికి ప్రతినిత్యం బిజీగా వుండేలా చేయాలి. తీరిక సమయాల్లో పిల్లలు డ్రాయింగ్ లాంటి ఆసక్తికరమైన అంశాలపై దృష్టి మరల్చాలి. చిన్నతనంనుండే న్యూస్‌పేపర్ చదివించాలి. అలా చదవడంవల్ల వారికి జనరల్ నాలెడ్జ్, అవగాహన కలుగుతుంది. విజ్ఞానం, వినోదం మేళవించే టీవీ కార్యక్రమాలు పిల్లలకు చూపాలి. పిల్లల్లో చిన్నతనంనుండే స్నేహభావం పెంపొందించాలి. అందరూ ఒకటని, ఐకమత్యమే మహాబలం అన్న చిన్న చిన్న గాథలు పెద్దలు పిల్లలకు తెలియజేయాలి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వారికి వివరంగా తెలియజేసి అవగాహన కలిగించాలి. పిల్లల ఆ హార అలవాట్లు, వారి ఆరోగ్య వికాసంకోసం పోషకాహారం నిత్యం అం దేలా చూడా లి. నేటి బాలలే భావి భారత పౌరులుగా అభివృద్ధినొందాలంటే పెద్దల బాధ్యత కూడా ఉందని గ్రహించాలి. అప్పుడే చిన్నారులకు శుభోదయం.

- ఎల్.ప్రపుల్లచంద్ర