ఐడియా

ఫోర్క్ మార్క్ ఆర్ట్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే తపన మనల్ని వెంటాడినప్పుడే సరికొత్త సృజనని ఆవిష్కరించగలం. పనికిరాని వస్తువులని పనికొచ్చే విధంగా మలచడంలో అందరూ సక్సెస్ కాలేరు. కానీ నిరంతరం వైవిధ్యంగా కనిపించాలని భావించినపుడే శిఖరాన్ని చేరగలం. కాగితం, చెక్క, ప్లాస్టిక్ కుర్చీలు, పనికిరాని ఇనుప వస్తువులు ఇలా దేనినైనా వైవిధ్యభరితంగా మలచగలిగే పరిజ్ఞానం కొంతమందికే సొంతం. వస్తువేదైనా దానితో ఓ చక్కని బొమ్మని చేయగలిగేవారు పదిమందిలో ఇట్టే తన శైలిని కనబర్చి అందర్నీ తమవైపు తిప్పుకుంటారు. ఆధునిక జీవనశైలిలో స్పూన్, ఫోర్క్‌లతో ఫుడ్ లాగించేస్తున్నారు. ఎక్కడ చూసినా ఫోర్కులు, స్పూన్లు, డిస్పోజబుల్ ప్లేట్లు. చేతికి ఎంగిలి అంటకుండా తిండి కానిచ్చేయడమే ఇప్పుడు నయా ట్రెండ్. అయితే అలాంటి ఫోర్క్ ఎన్ని వయ్యారాలు పోయిందో చూడండి. డైనింగ్ టేబుల్‌మీద ఉండాల్సిన ఫోర్క్ ఇపుడే డ్రాయింగ్ హాల్‌లో షోపీస్‌గా మారిపోయింది. ఆర్కెస్ట్రా గ్రూప్‌గా, పెప్పర్ సాల్ట్ పట్టుకొస్తున్నట్లు, బాహుబలిలా బాణం వేస్తున్నట్లు, సెల్‌ఫోన్ స్టాండులా, వాల్ హుక్స్‌లా ఇలా ప్రతిరూములో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫోర్కు స్టైలుగా హొయలొలుకుతోంది. వీటిని చూసి మీరూ మరిన్ని రకాల షోపీసులు తయారుచేసెయ్యండి.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి