ఐడియా

కనుబొమలను కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి అందం కనుబొమలు అనుకుంటే పొరబడినట్లే. కనుబొమలు కంటికే కాదు అమ్మాయిల అందాన్ని ఇనుమడింపజేస్తాయి. పుట్టుకతోనే కొంతమందికి కనుబొమలు ఒత్తుగా వస్తాయి. మరికొందరికి పలుచగా ఉంటాంయి. వీటిని అందంగా తీర్చిదిద్దుకోవటానికి అమ్మాయిలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వయసును తక్కువగా చూపించే కనుబొమలతోనే మనం చెప్పాలనుకున్నవి చెప్పేయ్యవచ్చు. కంటి చూపు ఇట్టే ఆకర్షించాలన్నా కనుబొమలను ఇంపుగా తీర్చిదిద్దుకోవాలి. కంటికి రక్షణనిచ్చే కనుబొమలను మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన దినుసులతో మిశ్రమాన్ని తయరుచేసుకుని రాసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవచ్చు. ఆవేమిటో తెలుసుకుందాం.
ఆల్మండ్ నూనెలో విటమిన్ ఏ,బీ,ఈ ఉంటాయి. వీటివల్ల జుత్తుకి తగిన పోషణ అంది జుత్తు బాగా పెరుగుతుంది. ఆల్మండ్ నూనెని కనుబొమల మీద వలయాకారంలో మసాజ్ చెయ్యండి. రాత్రంతా అలా ఉంచి పొద్దునే ముఖం కడుక్కోండి.
ఆలొవెరాలో ఉండే అలోనిన్ అనే పదార్ధం జుత్తు పెరుగుదలకు తోడ్పడుతోంది. ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు మీ కనుబొమల మీద ఆలోవెరా జెల్‌ని మసాజ్ చెయ్యండి. మంచి ఫలితం వచ్చేవరకూ ఇలా రోజూ చెయ్యండి.
కొబ్బరి నూనెని కనుబొమలకి పట్టించడం వల్ల కనుబొమ్మల జుత్తు ప్రొటీన్ కోల్పోకుండా ఉండి ఒత్తుగా పెరుగుతాయి.
కనుబొమ్మలకు ఆముదం పట్టించి కొంతసేపాగి కడిగెయ్యండి. ఆముదంలో ఉన్న సహజ గుణాలు కనుబొమ్మల జుత్తు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తాయి. ఇలా కనీసం ఆరు నెలలు చేస్తే మీ కనుబొమలు ఒత్తుగా పెరుగుతాయి.

గుడ్డుసొనలో ఉన్న బయోటిన్ జుత్తు పెరుగుదలకి తోడ్పడుతుంది. కనుబొమ్మల మీద గుడ్డుసొనని పట్టించి ఇరవై నిమిషాలాగి వెచ్చని నీటితో కడగండి. ఇలా రెండు వారాలు చేస్తే మంచి ఫలితం పొందుతారు.
మెంతులు వారానికి రెండుసార్లు మెంతుల పేస్ట్ అప్లయ్ చేస్తూ ఉంటే.. మీ కనుబొమ్మలు ఒత్తుగా మారిపోతాయి. మెంతుల పేస్ట్ రాసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.