ఐడియా

సృజనకు మారుపేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరంలో ఆకాశహర్మాలు, ఎత్తయిన పెంట్‌హౌస్‌ల నిర్మాణాల ట్రెండ్ నడుస్తున్న వేళ.. రష్మీతివారీ అనే ఈ ఆర్కిటెక్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ట్రెండ్ సృష్టిస్తోంది. రష్మీ లంగర్‌హౌజ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్‌నే ఇటుకలుగా ఉపయోగించి టాయిలెట్‌ను నిర్మించింది. పర్యావరణానికి తీవ్ర హానిచేస్తున్న ఈ బాటిల్స్‌ను సేకరించి అందులో మట్టి, ఆవుపేడతో నింపి నిర్మాణానికి ఉపయోగించింది. టాయిలెట్ నిర్మిస్తే రూ.25,000లు ఖర్చవుతుందని, బాటిల్స్ ఉపయోగించటం వల్ల కేవలం 18,000 రూపాయలకే పది రోజుల్లో నిర్మాణం పూర్తయిందని వెల్లడించింది. యూపీకి చెందిన రష్మీ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. నిర్మాణ రంగంలో పర్యావరణానికి అత్యధికి ప్రాధాన్యం ఇచ్చి సక్సెస్ సాధిస్తున్న తమ కుమార్తెను చూసుకుని నేడు తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు. జిహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించి ప్లాస్టిక్ బాటిల్స్‌తో టాయిలెట్స్ నిర్మాణం గురించి వివరిస్తానని, వారి ప్రోత్సాహంతో నగరంలోనూ, రూరల్ ప్రాంతాల్లో ఇకపై వీటితోనే నిర్మించేలా తనవంతుగా సహకరిస్తానని వెల్లడించింది.

ప్లాస్టిక్ బాటిల్స్‌నే ఇటుకలుగా ఉపయోగించి
రష్మీ నిర్మించిన టాయిలెట్