ఐడియా

బరువును తగ్గించే శనగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానబెట్టిన పచ్చి శెనగల్ని రోజూ ఉదయం పూట క్రమం తప్పకుండా తింటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది. శెనగల్లోని పొటాషియం, ఐరన్, జింకు వంటి పోషక పదార్థాలు శారీరక బరువును తగ్గించేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు దోహదం చేస్తాయి. కొవ్వు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతి రోజూ ఉదయం వేళ అల్పాహారంగా నానబెట్టిన లేదా ఉడికించిన శెనగలను తినడం ఉత్తమం. వీటిలోని పీచు, ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. మహిళల్లో రక్తహీనత నివారణకు, పిల్లల్లో ఎదుగుదలకు అవసరమైన ఐరన్, జింకు వంటివి శెనగల్లో లభిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ను అరికట్టే ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి. గర్భిణులకు అవసరమయ్యే ఫోలేట్స్ కూడా శెనగల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కాల్షియం కారణంగా ఎముకలకు దృఢత్వం చేకూరుతుంది. బరువు తగ్గాలనుకునేవారు నానబెట్టిన శెనగల్ని రోజూ మితంగా తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.