ఐడియా

పెరుగుతో ఆరోగ్యం మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. బరువుతగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈమధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. కానీ, నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. రోజూ 300 మిల్లీలీటర్ల పెరుగు తాగితే ఆస్టియో పోరోసిస్, క్యాన్సర్లు, ఉదర సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. పెరుగు తీసుకుంటే ఆకలి తొందరగా వేయదు. అల్సర్లు, కడుపు నొప్పి తగ్గుతాయి. ఇది రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. శరీరంలో జీవక్రియలను చురుగ్గా ఉంచే శక్తి దీనికి ఉంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది.
200 గ్రాముల పెరుగులో దాదాపు 300 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. తగినంతగా కాల్షియం తీసుకోని పక్షంలో శరీరంలో కొవ్వు శాతం బాగా పేరుకుపోతుంది. ఇందులోని ‘లేప్టీన్’ హార్మోన్ శరీరంలోని శక్తిని బాగా ఖర్చుచేస్తుంది. పెరుగు తీసుకుంటే చిరుతిళ్ల జోలికి పోయే అవసరం ఉండదు.
ఉష్ణతత్వం ఉన్నవారికి పెరుగు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయం చేస్తుంది. కేశ సంరక్షణలో కూడా దోహదపడుతుంది. ఉదయం పూట విధిగా పెరుగు తీసుకోవడం ఎంతో ఆరోగ్యదాయకం. 89 శాతానికిపైగా నీటిని కలిగి ఉన్న పెరుగులో ప్రొటీన్లు, ఎమినోయాసిడ్‌లు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మలబద్ధకం, డయేరియా, పేగు క్యాన్సర్, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకాకస్ అనే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు లాక్టోజ్, చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తాయి. పెరుగులో విటమిన్-ఎ, ఇ, సి, బి2, బి6, బి12, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
పాలతో పోలిస్తే పెరుగులోని కాల్షియం విటమిన్-డి తయారీకి అధికంగా తోడ్పడుతుంది. గనుక ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవాళ్ళకి ఇది మేలు చేస్తుంది. ఎసిడిటీతో బాధపడేవాళ్లకి పాలకన్నా పెరుగే మంచిది. విటమిన్ బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని, నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. పిల్లలకూ, వృద్ధులకూ ఇది ఎంతో మంచిది. ఆహారాన్నీ సులువుగా జీర్ణం చేయడంలో, దంతాలు, ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో పెరుగు ఉపయోగపడుతుంది. అయితే- దగ్గు, జలుబుతో బాధపడేవారు దీన్ని రాత్రి పూట దీన్ని తీసుకుంటే శే్లష్మం అధికంగా వృద్ధి చెంది అనారోగ్యం పాలయ్యే అవకాశం వుంది. పగటి పూట చక్కెర కలపకుండా తినాలి. రాత్రిపూట కచ్చితంగా తినాలనుకుంటే కాస్త చక్కెర లేదా మిరియాల పొడి వేసుకోవాలి. గడ్డపెరుగుకు బదులు నీటిని కలిపి మజ్జిగ చేసుకుని తాగడం ఉత్తమం.

-వినీతామూర్తి