ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆరోగ్య పరిరక్షణలో తేనె ఎంతగానో మేలు చేస్తుంది. సహజసిద్ధంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించి, జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. పంచామృతాల్లో తేనె ఒకటి. తేనెటీగలు సేకరించే పూలలోని మకరందాన్ని బట్టి ఇది వివిధ రకాలుగా వుంటుంది. తేనెలో పిండి పదార్థాలు, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి-1, 2, సి వంటి పోషక విలువలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజ ధాతువులైన రాగి, మాంగనీస్, పొటాషియం లాంటివి దీనిలో పుష్కలంగా లభిస్తాయి.
తేనె కలిపిన పంచామృతం తీసుకోవటం వల్ల మానవ ఆయుష్షును పెంచవచ్చునని అనేక పరిశోధనల్లో రుజువైంది. తేనెలో పైత్యాన్ని హరింపజేసే గుణం వుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకున్నట్లయితే జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. పంచదార, బెల్లంకు బదులుగా వాడితే ఇది ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. తేనె ఎంత సురక్షితమైనదంటే దీనిని అపుడే పుట్టిన పసికందులకు కూడా ఇవ్వవచ్చు. నిమ్మరసం కలిపిన నీటిలో కాస్త తేనె కలిపి పరగడుపున తాగినట్లయితే గొంతు నొప్పి, గరగర వంటివి పోతాయి. దీనివల్ల ఉత్సాహం, ఉత్తేజం కలుగుతాయి. ఒక చెంచాడు తేనె, కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. తేనెలో కాస్త నీరు, సున్నం కలిపి కీళ్లనొప్పులు, బెణుకులు చోట పైపూతగా రాస్తూ వుంటే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం, కస్తూరి కలిపి స్నానం చేసినట్లయితే నిద్రలేమి వల్ల కలిగే బద్ధకం పోతుంది. చర్మం మృదువుగా మారి మంచి నిగారింపును సంతరించుకుంటుంది. తేనె ముఖానికి రాసి పలచగా ఆరనిచ్చి దూదితో నెమ్మదిగా తడుపుతూ వుంటే కొంతకాలానికి చర్మం మృదువుగా మారుతుంది.

-సుబ్బలక్ష్మి