ఐడియా

గింజలు తింటే క్యాన్సర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలువైన పోషకాలున్న బాదం, జీడిపప్పు, వేరుశెనగ, పిస్తా, వాల్‌నట్స్ వంటి గింజలను తరచూ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లకు లోనుకాకుండా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించాలంటే గింజలను విరివిగా తీసుకోవాలి. ఉదయం పూట అల్పాహారంగా మొలకెత్తిన పెసలు, బఠానీలు, వేరుశెనగ వంటివి తినాలి. బాదం, జీడిపప్పు వంటి గింజలను వారంలో కనీసం మూడుసార్లయినా తీసుకోవడం మంచిది. తినే ఆహారంలో గింజలను చేర్చుకోవడం వల్ల మహిళల్లో 15 శాతం వరకూ పెద్దపేగు క్యాన్సర్‌ను అడ్డుకునే అవకాశం ఉంది. ఊబకాయం, టైప్ 2 మధుమేహం ఉన్న మహిళలు ఎక్కువగా పెద్దపేగు క్యాన్సర్ బారిన పడుతున్నారు. బరువు, మధుమేహాన్ని నియంత్రించుకోగలిగితే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.