ఐడియా

దివ్యౌషధం.. కర్పూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజల సందర్భంగా హారతి ఇచ్చేందుకే కాదు, కర్పూరాన్ని ఔషధపరంగానూ ఉపయోగిస్తుంటారు. దీనికి ఆయుర్వేద వైద్యంలో విశిష్ట స్థానం ఉంది. చిన్న చిన్న అనారోగ్యాలకు కర్పూరం వాడితే
ఉపశమనం లభిస్తుంది.
నాలుకపై పేరుకున్న జిగురును పోగొట్టి, అరుచిని తొలగిస్తుంది.
పిప్పి పన్ను మీద కర్పూరాన్ని కాసేపు ఉంచితే నొప్పి తగ్గుతుంది.
జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తుంది.
కొబ్బరినూనెలో కర్పూరాన్ని రంగరించి కురుపులపై రాస్తే అవి తగ్గిపోతాయి.
కడుపులో ఉబ్బరాన్ని పోగొడుతుంది.
నరాల బలహీనతను నివారిస్తుంది.
ఎలర్జీల వల్ల కలిగే దురద, దద్దుర్లమీద కర్పూరాన్ని రాస్తే నివారణ కలుగుతుంది.
కఫాన్ని కరిగించే గుణం కర్పూరంలో ఉంది.
చర్మంమీద వచ్చే వాపును పోగొడుతుంది.
తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
కర్పూరం లేదా కర్పూరం మొక్క ఆకులు కీటకాలను పారదోలుతాయి.
ఎగ్జిమా వ్యాధి తీవ్రత తగ్గడానికి సాయపడుతుంది.
కీళ్ల వాతానికి, కీళ్ళనొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
బ్రాంకైటిస్ వ్యాధితో బాధపడేవారు మరుగుతున్న నీటిలో కర్పూరాన్ని వేసి ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది.
ఇంగువలో కర్పూరాన్ని కలిపి తీసుకుంటే ఉబ్బసంలో ఏర్పడే ఆయాసాన్ని తగ్గిస్తుంది.
మెత్తటి గుడ్డలో కర్పూరాన్ని ఉంచి వాసన చూస్తుంటే పడిశం తగ్గుతుంధి.
కర్పూరంలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి.
గుండె దడను నివారిస్తుంది.
కర్పూరాన్ని వెలిగించినప్పుడు వెలువడే వాయువులు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.
చర్మంమీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది.
కర్పూరం పొడిని మోచేతుల మీద రుద్దితే నలుపుదనం పోయి చర్మం కాంతులీనుతుంది.
కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
దీని వాసన చూస్తుంటే ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది.
పండ్ల పొడి, టూత్‌పేస్ట్‌ల తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
వేసవిలో స్నానం చేసే నీటిలో కర్పూరాన్ని కలపటం లేదా కూలర్‌లో కర్పూరాన్ని వేసి ఉపయోగిస్తే గదంతా పరిమళభరితంగా ఉంటుంది.
వేపాకు ముద్దలో కర్పూరాన్ని కలిపి శిరోజాలకు పట్టించి, తడి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే పేల సమస్యకు నివారణ కలుగుతుంది.

- కె. నిర్మల