ఐడియా

మురికి తొలగి మెరిసేలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలో తిరిగొచ్చేసరికి ముఖం పై మురికి పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది. ముఖంపై పట్టిన ఈ మురికిని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదార్థాలనే ఉపయోగించుకోవచ్చు. టొమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే మురికి పోవటంతో పాటు మంచి మెరుపు కనిపిస్తోంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, రాత్రి నిద్ర పోవటానికి ముందు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే మురికి పోవటమే కాదు చర్మం రంగు మెరుగవుతుంది కూడా. చిటికెడు పసుపూ, ఒక స్పూను పాల పొడి, రెండు చెంచాల తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఒట్స్‌ని పొడి చేసుకుని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని, మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమంతో బాగా రుద్దితే మురికి వదిలిపోతుంది. మురికిని పోగొట్టుకోవడానికి మరో సులువైన పద్ధతి కొబ్బరి నీళ్లతో శుభ్రం చేసుకోవడం, ముఖాన్నీ, చేతుల్నీ, కొబ్బరి నీళ్లతో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. చర్మం మృధువుగా మారుతుంది.