ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండు ద్రాక్షల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, నీరు, విటమిన్ సి లాంటి పోషక పదార్థాలు లభిస్తాయి. ఇవి శరీరారోగ్యానికి మేలు చేయడమే కాక, ఔషధపరంగా కూడా ఉపయోగిస్తుంది.
-రక్తకణాల నిర్మాణానికి సాయపడుతుంది. కామెర్ల వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. అలసటను పోగొడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెంపొందటానికి తోడ్పడుతుంది. కంటిచూపు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎండు ద్రాక్షను, ఎండు ఖర్జూరం ముక్కలను కాచి చల్లార్చిన నీటిలో నానేసి, అందులో పటికబెల్లం పొడిని వేసి, అది బాగా నానిన తర్వాత వాటిని ఆ నీటిలోనే పిసికి, ఆ నీటిని వడకట్టి పిల్లలకు త్రాగిస్తే వడదెబ్బ తగలదు. అధిక దప్పికను అరికడుతుంది. పైత్యాన్ని పోగొడుతుంది. రక్తలేమిని పోగొట్టి రక్తవృద్ధికి తోడ్పడుతుంది. చిన్నపిల్లలు త్రాగే పాలల్లో 2, 3 ఎండు ద్రాక్షలను వేసి, వేడి చేసి, ఆ పాలను త్రాగిస్తే పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం బాగుంటాయి. దంతాలు దృఢంగా మారతాయి. బలాన్ని కలిగిస్తుంది. వైరస్, బాక్టీరియాలతో పోరాడి, ఇన్‌ఫెక్షన్ రాకుండా నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. ఆకలిని తగ్గించే గుణం వుంది కనుక డైటింగ్ చేసేవారు ఎండు ద్రాక్షను తీసుకోవడం మంచిది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. చర్మవ్యాధులను నివారించి, సహజ చర్మ కాంతిని పెంపొందిస్తుంది. ఎండు ద్రాక్షను పాలల్లో వేసి కాచి, ఆ పాలను త్రాగితే అజీర్తిని పోగొడుతుంది. కాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది.

- కె.నిర్మల