ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆహారపు అలవాట్లు అధిక రక్తపోటుకు దారితీస్తుంది. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తరచూ, కనీసం నెలకొకసారి తమ రక్తపోటు ఎంత వున్నదీ పరీక్ష చేయించుకోవడం ఎంతైనా మంచిది.
రక్తపోటుని అదుపులో వుంచడానికి అధిక రక్తపోటుగలవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.
ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. సోడియం వున్న పదార్థాలు, కొవ్వు ఎక్కువగా వున్న ఆహారం ఎంత తక్కువ తింటే అంత మంచిది.
బరువు పెరగకుండా అదుపులో వుంచుకోవాలి. తగినంత వ్యాయామం చేస్తూ వుండాలి. బాగా నిద్రపోతే మంచిది. విశ్రాంతిగా, తాపీగా చేసుకునే పనులనే దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
పొటాషియం ఎక్కువగా వుండే ఆహార పదార్థాలని తినటం మంచిది. నారింజ, బత్తాయి, అరటి, టమాటో మొదలైన పళ్ళలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.
ఇంట్లో కాకుండా బయట తినాల్సి వచ్చినపుడు వీలైనంతవరకూ ఉప్పు వెయ్యని ఆహార పదార్థాల కోసం అడగాలి. సూప్‌లు, సాస్‌లు వంటి వాటి జోలికి పోకుండా వుంటే మంచిది.
డబ్బాల్లో నిల్వ చేసిన పదార్థాలని, శీతలీకరణ ద్వారా ఘనీభవింపచేసిన వాటిని, ఫాస్ట్ఫుడ్స్‌ని అధిక రక్తపోటు వున్నవారు తీసుకోవడం మంచిదికాదు. అవి ఉప్పగా లేకపోయినా వాటిలో సోడియం ఎక్కువగా వుం టుంది. అలాగే కారన్‌ఫెక్స్, బేకింగ్ ద్వారా ఉడికిన బీన్స్, డబ్బాలలో నిల్వ చేసిన కూరలు, ఊరగాయ పచ్చళ్ళు మొదలైన వాటిలో కూడా సోడియం అధికంగా వుంటుంది. అందువల్ల అధిక రక్తపోటు వున్నవారు వాటి జోలికి పోకుండా వుంటే మంచిది.

- బి.మాన్‌సింగ్ నాయక్