ఐడియా

పనసతో సొగసు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు లభించే పండ్లు చాలామటుకు తినటానికి రుచికరంగా వుంటాయి. అలాగే ఆరోగ్యానికి మంచి ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటిలో పనస కూడా ఒకటి. జుట్టు రాలిపోవడం, తల దురద వంటి వాటి నివారణకు పనస గింజలు చక్కగా పనిచేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని, ఆ తరువాత ఒకటిన్నర చెంచా పనస గింజల పొడి, ఒక చెంచా పెసరపొడి, నువ్వుల నూనె కలిపి తలకు రాసుకుని పది నిముషాల తరువాత శీకాయతోగానీ, షాంపూతోగాని కడుక్కోవాలి. దీనివల్ల దురదలు, జుట్టు రాలడం తగ్గుతుంది. పనస తొనను మెత్తగా మిక్సీలో రుబ్బి ఆ ముద్దను కళ్ళపైన రాసుకుంటే కళ్ళకు మంచి మెరుపు వస్తుంది. పనస ఆకులు, కాయలు, పండ్లు, పనసకు సంబంధించిన ప్రతిదీ మంచి సౌందర్య పోషణకు ఉపయోగపడతాయి. అమ్మవారు పోసినపుడు, ముఖంపై అలర్జీ వంటివి వచ్చినపుడు ఏర్పడే మచ్చలను పనస ఆకులు బాగా పనిచేస్తాయి. లేత పనస ఆకులను నిప్పులపైన కాల్చి బూడిద చేసి దానిని కొబ్బరినూనెలో రంగరించి, దురదలు, అలర్జీ, మచ్చలు ఉన్న చోట క్రమపద్ధతిలో రాస్తూంటే కొన్ని రోజులకు అవి క్రమంగా మాయమైపోతాయి. ముఖం, చర్మం కాంతివంతమై సుందరంగా తయారవుతుంది.
యాభై సంవత్సరాలు పైబడినవారు పండిన సగం పనస తొన, ఒక అరటిపండు ముక్క, ఒక చెంచా శెనగపిండి, పాలు తీసుకుని బాగా మెత్తగా చేసి దానిని మెడ పైన వ్రాసుకుంటే వయసు పెరుగుదల వల్ల వచ్చే ముడతలు అవీ పోతాయి.
పనస తొనను నానబెట్టి దానికి తేనె కలిపి ముఖానికి చేతులకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం తళతళలాడుతూ మెరుస్తూంటుంది.
ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు నాలుగు పనస గింజలను నిప్పులమీద కాల్చి తింటే ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. పొట్టకూడా పైకి రాకుండా తగ్గుతుంది. కొందరిది వేడి శరీరంగా వుంటుంది. వేడి చేయటంవల్ల త్వరగా
అలసిపోతారు. ఇలాంటి సమస్య ఉన్నవారు పనస ఆకులతో కుట్టిన విస్తరిలో వేడి వేడిగా భోజనం చేస్తే వేడి సమస్యలు పోయి, శరీరానికి కొత్త శక్తి వస్తుంది.

- మనస్విని