ఐడియా

మేకప్‌తో ఆత్మవిశ్వాసం మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం మేకప్ వేసుకుంటూ అందాలొలికే మహిళల్లో ఆత్మవిశ్వాసం, శృంగార భావనలు ఎక్కువగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సౌందర్య పోషణకు ఆసక్తి చూపే మగువలు తరచూ అద్దం ముందు కాలక్షేపం చేస్తూ మేకప్ పట్ల దృష్టిసారిస్తుంటారు. వీరు ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా ఎపుడూ చిరునవ్వు చిందిస్తుంటారని న్యూ యార్క్‌లోని ఫోర్డ్‌హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనంలో విశే్లషించారు. మేకప్ వేసుకునే మహిళలు వారి జీవిత భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తున్నారనే అంశంపై ఆరా తీయగా, శృంగార జీవితంలో వీరు ఎంతో ఉత్సాహవంతంగా ఉన్నట్లు గమనించారు. వందలాది మంది అతివలను సర్వే సందర్భంగా ప్రశ్నించగా, మేకప్‌కు అలవాటు పడిన కొద్ది రోజుల్లోనే వారిలో ఆశావహ దృక్పథం చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. శృంగార జీవితంపై మరింత ఆసక్తి పెరిగిందని 71 శాతం మంది, సామాజిక సంబంధాలు మెరుగుపడ్డాయని 77 మంది, మంచి మార్పు కనిపించిందని 85 శాతం మంది మహిళలు సర్వేలో తెలిపారు. జీవిత భాగస్వామి నుంచి మెప్పు పొందినట్లు 65 శాతం మంది, ఇతరులతో ఎంతో సరదాగా ఉంటున్నట్లు 56 శాతం మంది మగువలు చెప్పారు. మేకప్ వల్ల దేహ సౌందర్యంతో పాటు తమ ఆలోచనా ధోరణి, జీవనశైలి, భావోద్వేగాలు ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు. జీవిత భాగస్వాములు గతంలో కంటే ఎక్కువగా ప్రేమాభిమానాలు చూపుతున్నారంటే అది మేకప్ మహిమేనని చాలామంది మహిళలు తమ అంతరంగాల్ని ఆవిష్కరించారు. ప్రఖ్యాత సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘రెవ్‌లాన్’ సహకారంతో పరిశోధకులు ఈ సర్వే జరిపారు.