ఐడియా

మనోధైర్యాన్నిచ్చే మానసిక పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలలో భక్త్భివం వలన మానసికంగా వారికి మనోధైర్యం లభిస్తుంది. ఉదయానే్న గృహిణి లేచి స్నానం చేసి పూజ గదిలో కాసేపు ధ్యానం చేసి తమ దైనందిన కార్యక్రమాలలోనికి అడుగుపెడితే.. ఎంతో బాగుంటుంది.
వంటింట్లో పనులు.. పిల్లల్ని చూసుకోవటం ఇల్లు అందంగా ఉంచుకోవటం తదితర పనులతో మహిళలు తీరిక లేకుండా ఉన్నా.. కాస్తంత భక్త్భివం అలవరచుకోవడానికి వీలుగా ధ్యానం చేయాలి. ధ్యానంవలన మనసు ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఏకాగ్రత లభిస్తుంది. ముఖంలో కళ వస్తుంది. మానసికంగా రిలీఫ్ కలుగుతుంది. భక్తి ప్రపత్తులతో భగవంతున్ని కొలిచే ఓపిక మహిళలకి అధికంగా ఉంటుంది. భారతీయ సనాతన ధర్మం భక్త్భివంతో రక్షించబడుతుందే విషయం మరువద్దు. అందుకే ఆలయాలన్నీ మహిళలతో కిటకిటలాడుతుంటాయి. మహిళా జగతికి ఇది ఒక ఆదర్శం. ప్రస్తుతం టీవీ ప్రసారాలలో భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైపు స్ర్తిలు తమ దృష్టి మరల్చాలి. అర్థం పర్థం లేని టీవీ సీరియల్స్‌కన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాస్త మిన్న.. అని గ్రహిస్తే ఎంతో మంచిది.

- ప్రపుల్లచంద్ర