ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటీ స్పూన్ పసుపు, తాజా కొబ్బరు తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
అరికాళ్ళు మృదువుగా వుండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళల్లు నల్లగా వుంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. తర్వాత శెనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లకు పట్టించి ఆరాక కడిగేయాలి.
కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం వుంటుంది.
క్యారెట్ తురుమునకు రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్‌లా వేయాలి.
టేబుల్ స్పూన్ శెనగపిండి పుల్ల పెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.
నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమంతో ముందుగా పాదాలను శుభ్రపరచాలి. ఇది స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకున్న మృతకణాలన్ని తొలగిపోతాయి. ఆ తర్వాత నాలుగు చెం చాల పాలు, తేనె, గోధుమపిండి ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా చేసి పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
నెయిల్ పాలిష్ వేసుకునే ముందు కాలి వేళ్ల మధ్య దూదిని గుండ్రంగా చేసి పెట్టుకుంటే నెయిల్ పాలిష్ అటూ ఇటూ అంటకుండా ఉంటుంది.
బొప్పాయి కాయను కానీ, ఆకును కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళు ఆనెలమీద పెట్టి కట్టుకడితే అవి మెత్తబడతాయి.
రెండు మగ్గిన టమోటాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. టమోటాను మిక్సీలో వేసి గుజ్జులా చేసుకుని దానికి నువ్వుల నూనె, ఉప్పు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతికి తడి చేసుకుని అదంతా చర్మంలోకి ఇంకేలా నలుగు పెట్టినట్లుగా మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.