ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గినె్న అంచులకి గ్లిసరిన్ రాస్తే పాలు పొంగవు.
నువ్వుల పప్పు వేయించేటప్పుడు మూకుడులో రెండు చెంచాల నీరు కూడా పోసి వేయించితే పొడి కొట్టినపుడు ముద్ద అవదు.
వంటగదిలో ఈగల బాధ అధికంగా వుంటే పుదీనా ఆకుల్ని బాగా నలిపి కిచెన్ రూంలో నాలుగైదు చోట్ల వుంచండి. ఈగలు దూరంగా పోతాయి.
వాష్‌బేసిన్‌లో చిన్న కర్పూరం ముక్క వేస్తే బొద్దింకల్లాంటి పురుగులు దరిచేరవు.
అరటికాయలు, నిమ్మకాయలు నీళ్ళలో వేసి వుంచితే చాలా రోజులు నిలువ వుంటాయి. నీళ్ళు రోజూ మార్చుతూ వుండాలి.
మీ ఇంట్లో గోంగూర ఉడకబెట్టినపుడల్లా వెండి వస్తువులు కడగండి. ముఖ్యంగా పూజ గదిలోని వెండి సామగ్రి కడిగితే అవి తళతళా మెరుస్తాయి.
ఉప్మా చేసేటపుడు నీళ్ళు తెర్లుతుండగా గరిటెడు పాలు, అర చెంచా పంచదార వేసినట్లయితే ఉప్మా రుచిగా ఉంటుంది.
స్వెట్టర్లని ఉతికేటప్పుడు ఒక స్ఫూన్ గ్లిజరిన్ వేస్తే షింక్ అవ్వదు. ఊలు కూడా పాడవ్వదు.

- బి.మానసింగ్ నాయక్