ఐడియా

తమలపాకుతో వ్యాధులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విందు భోజనం తర్వాత తమలపాకు కిళ్ళీ వేసుకోవడం భారతీయుల ప్రత్యేకత. పండుగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో తమలపాకు తప్పనిసరిగా వుండాల్సిందే. రాజు, పేద తేడాలేకుండా అందరినీ రంజింపజేసే తమలపాకు పుట్టిల్లు మలేషియా. రెండువేల సంవత్సరాల క్రితమే ఇది ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది.
తమలపాకు సేవనంవల్ల మనసుకు ఉత్తేజం కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తలనొప్పి, పంటి నొప్పి, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. చిగుళ్ళ వ్యాధులకు కూడా ఇది మంచి ఔషధం. రక్తస్రావాన్ని అరికడుతుంది. సాధారణ రుగ్మతలకు తమలపాకును వాడే ఆచారం మన దేశంలో ప్రాచీన కాలంనుంచి వుంది. మలేషియాలో తల నొప్పికి, కీళ్ళనొప్పులకు మొదట తమలపాకునే ఉపయోగించి చూస్తారు. తమలపాకు కాడలను ఉప్పువేసి దంచి, పళ్ళకు రాసుకుంటే పంటి నొప్పి మటుమాయమవుతుందని థాయ్‌లాండ్, చైనా ప్రజల విశ్వాసం. ఇండోనేషియాలో తమలపాకు, వక్క కలిపి నమిలి మింగితే దగ్గు, ఆస్తమా నయమవుతాయని నమ్ముతారు. తమలపాకుల్లో వుండే మేలురకం విటమిన్ ఏ వల్ల కంటిచూపు మెరుగవుతుంది.
తమలపాకు మొక్క తీగ జాతికి చెందినది. ఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. పైపర్ బీటల్ అనే మిరియపు జాతికి చెందినది. తమలపాకులో అనేక రకాలున్నాయి. మామూలు తమలపాకులు అరచేతిలో సగం వుంటాయి. కలకత్తా, బనారసి తమలపాకులు 15నుంచి 20 సెంటీమీటర్లు పొడవు వుంటాయి. కలకత్తా ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో సుగంధంతో వుంటుంది. బనారసి ఆకు లేత ఆకుపచ్చరంగులో వుంటుంది. కలకత్తా ఆకులకు మంచి డిమాండ్ వుంది.
మానవులు రెండువేల ఏళ్ళనుండి తమలపాకులు సేవిస్తున్నట్టు చారిత్రక ఆధారాలు వున్నాయి. పాళి భాషలో రాసిన శ్రీలంక చారిత్రక గ్రంథం ‘మహావంశ’లో తమలపాకు ప్రస్తావన వుంది.
తమలపాకు టీ:- తమలపాకులో వివిధ సుగంధ ద్రవ్యాలువేసి కట్టే పాన్‌లకు హైదరాబాద్, ఢిల్లీ, అజ్మీర్ నగరాలు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లో రూపాయి పాన్ నుంచి కొన్ని వేల రూపాయల పాన్‌ల వరకు లభిస్తాయి. తమలపాకుతో ‘టీ’తయారుచేసుకోవచ్చు. రెండు కప్పుల నీళ్ళను వేడిచేసి ఏడు తమలపాకులు వేసి మరగబెట్టాలి. నీళ్ళు మరిగి ఒక కప్పు కషాయంగా మారిన తర్వాత చల్లార్చి తాగితే జలుబు, దగ్గు, నొప్పులు నయమవుతాయి. శరీరం తేలికపడిన అనుభూతి కలుగుతుంది.

- బి.మాన్‌సింగ్ నాయక్