ఐడియా

పెప్పర్‌మింట్ నూనెతో దోమలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమల నివారణ ప్రపంచవ్యాప్త సవాలు. దోమలవల్ల మలేరియా, చికన్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పెద్ద కంపెనీలు తయారుచేస్తున్న కాయిల్స్, ఇతర పరికరాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. పెప్పర్‌మింట్ ఆయిల్ ద్వారా దోమలను సమూలంగా నిర్మూలించవచ్చని ఢిల్లీకి చెందిన శాస్తవ్రేత్త పద్మావాసుదేవన్ కనుగొన్నారు. దీనిపై ఆమె ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆమె సహచరులు విస్తృత పరిశోధనలు చేశారు. పెప్పర్‌మింట్ ఆయిల్ దోమలను తరిమికొడుతుందని వీరు శాస్ర్తియంగా నిరూపించారు. దోమల లార్వా (దోమ గుడ్లనుంచి అప్పుడే బయటికివచ్చి కిటికీల మూలల్లో, నీటి తొట్టెలలో వుంటాయి). సమూలంగా నిర్మూలించవచ్చని వెల్లడించారు. కాయిల్స్, రిపెలెంట్లు దోమలను పారదోలగలవే గానీ లార్వాను అంతం చేయలేవు. ఇంకా మంచి విషయం ఏమిటంటే పెప్పర్‌మింట్ ఆయిల్ మలేరియాను వ్యాప్తిచేసే ఎనోఫెలెస్ దోమను చావుదెబ్బతీయడం. ఈ శాస్తవ్రేత్తలు ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. పెప్పర్‌మింట్ చెట్టు (శాస్ర్తియ నామం మెంథా పైపెరిటియా) నుంచి వీరు నూనెను తీశారు. దోమల లార్వా వున్న నీటి తొట్టి పైభాగంలో వీరు కొంత నూనెను చల్లారు. మరుసటి రోజు చూస్తే లార్వా పూర్తిగా చనిపోయింది. ఈ పరిశోధనతో స్ఫూర్తిపొందిన అనేకమంది స్వయంగా దీని సామర్థ్యాన్ని పరీక్షించాలనుకున్నారు. వీరు తమ శరీరాలపై రాసుకుని ఆరుబయట నిద్రపోయారు. ఒక్క దోమకూడా తమమీద వాలలేదని 10 మందిలో 8 మంది చెప్పారు.

- బి.మాన్‌సింగ్ నాయక్